మగువ నీవే మాతో మాటలే యాడవుగాని - తాళ్ళపాక అన్నమాచార్య సంకీర్తన

P Madhav Kumar

 ꧁♾️•••••••••┉━❀🕉️

శృంగార సంకీర్తన.                 2721. 4-11-23

రేకు: 1617-3

సంపుటము: 26-99

రాగము: పాడి


మగువ నీవే మాతో మాటలే యాడవుగాని

తగవాయఁ బనులెల్ల తనిసితి మమ్మా

॥పల్లవి॥


పూచెఁ బూచె వెన్నెలలు పున్నమచంద్రుని వద్ద

రాచిలుకలందు దోఁచె రంతు వనాన

వీచె నిదె చల్లగాలి వేడుక ముంగిట నిదే

యేచి మరురాజ్యమాయ నేవి గడమమ్మా

॥మగు॥


కుందనపుజక్కవలు కుంకుమలే కురిసీని

ముందుముందె లతలను ముత్తేలువండె

కందువతో నాకసము గంటు వదలె నింతలో

కందువ నామని మించె గడమేఁటిదమ్మా

॥మగు॥


తుమ్మిదలు చెలరేఁగెఁ దొడరి యాడకాకడకు

వుమ్మడి నుగ్గుదేనియ లుట్టిపడెను

కొమ్మరొ శ్రీ వేంకటేశుకూట మిది గాఁబోలు

సమ్మతించితిమి మేము చాలదా వోయమ్మ

॥మగు॥      

                 *సేకరణ : సూర్య ప్రకాష్ నిష్టల* 

꧁♾️•••••••••┉━❀🕉️❀┉┅•••••••••♾️꧂

                ‌ ‌

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat