ఏమి నోము నోచెనో యింతక తొల్లి - తాళ్ళపాక అన్నమాచార్య సంకీర్తన

P Madhav Kumar


శృంగార సంకీర్తన.        2719.    ‌2-11-23

రేకు: 1245-5.             సంపుటము: 22-269

రాగము: శంకరాభరణం     గానం: శ్రీనిధి


ఏమి నోము నోచెనో యింతక తొల్లి

నీ మనసురా మెలఁగి నీకు దేవులాయను

॥పల్లవి॥


యెంత వలచినదో యీ యింతి నీకును

వింతవింతమాట లాడి వేఁడుకొనీని

పొంతనా లెట్ల నీతో బోసఁగఁగూడెనో

చెంతల నేపొద్దు నిన్నుఁ జేరి యెడవాయదు

॥ఏమి॥


కామినికి నీమీఁదికాంక్ష ఇఁక నెట్టిదో

నీమోమే చూచుకొంటా నిలుచున్నది

ప్రేమతో యేసగినానఁ బెండాడెనొ నిన్ను

చేముంచి నీమనసులు చేకొనీఁ దానిన్నిటా

॥ఏమి॥


యీయలమేల్‌మంగ నీకు నెట్టిచుట్టరికమో

ఆయితమై నీవురమునందె వున్నది

కాయజకేళి కూడిన కందువవేళ యెట్టిదో

పాయపు శ్రీవేంకటేశ ప్రబలె నీకృపను

॥ఏమి॥        

                 *సేకరణ : సూర్య ప్రకాష్ నిష్టల* 

꧁♾️•••••••••┉━❀🕉️❀┉┅•••••••••♾️꧂

                ‌ ‌

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat