సుందరమయ్యా ....
ప) సుందరమయ్యా నీ రూపం
స్వామి అయ్యప్ప
సుమధురమయ్యా నీ నామం
శరణం అయ్యప్ప
చ) చూచేకొద్ది చూడాలనిపించేది నీ మోము
చేతులు జోడించి నీముందు
ప్రార్ధించుతుంటాము మేము
స్వామి అయ్యప్ప...శరణం అయ్యప్ప
చ) పిలిచినకొద్ది పిలవాలనిపించేది నీ నామం
నిను తలచుకుంటూ పిలుచుకుంటూ
ధ్యానించుతుంటాము నీ ధామం
స్వామి అయ్యప్ప...శరణం అయ్యప్ప
చ) శరణాగత శరణంటూ
నీ శరణాలు పాడుతాము
నీ సన్నిధి మాకందించమంటూ
నీ చరణాలు వేడుతాము
స్వామి అయ్యప్ప...శరణం అయ్యప్ప
చ) కోరిన కోర్కెలు తీర్చే
కలియుగ వరదుడవు
పాపాలను పరిమార్చే
పంచగిరుల పరంధాముడవు
స్వామి అయ్యప్ప...శరణం అయ్యప్ప