7 . పంచగిరీశా ....
ప) పంచగిరీశా పాలించయ్యా
పరంధామా లాలించయ్యా
పరమార్ధం భోధించయ్యా
పరమపదము అందించయ్యా
స్వామియే శరణము స్వామీ
నీ చరణమే శరణము స్వామీ
చ) నియమాల మాలధారణం
ఇలలోనే ముక్తి తోరణం
నీ దీక్ష చేసుకుంటుంటాము
నీ రక్ష కోరుకుంటుంటాము
స్వామియే శరణము స్వామీ
నీ చరణమే శరణము స్వామీ
చ) మధురం నీ నామస్మరణం
నీ స్పురణం పాపహరణం
నిన్ను పిలుచుకుంటుంటాము
నిన్ను తలచుకుంటుంటాము
స్వామియే శరణము స్వామీ
నీ చరణమే శరణము స్వామీ
చ) కలిలో కామితార్ద కారకం
శబరియాత్ర క్షేమదాయకం
ఇరుముడులే తెస్తుంటాము
నీ కొండకొస్తుంటాము
స్వామియే శరణము స్వామీ
నీ చరణమే శరణము స్వామీ
చ) నీ పూజనం నీ సేవనం
నీ దర్శనం కడుపావనం
నీ పడి అధిరోహణం
సకల పాపహరణం
స్వామియే శరణము స్వామీ
నీ చరణమే శరణము స్వామీ
- ఇ. సాయికృష్ణ
************