ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్పా
11. కలి దైవమ్ము ....
ప) కలి దైవమ్ము నీవయ్యప్పా
నీకంటే మిన్నెవరప్పా
శరణంటిమి శబరివాసా
కరుణించుము కరిమలేశా
మా మనసు మంటపమందు
నీవే కొలువుండాలి
మా ఎదలో చిరునవ్వులు
చిలికే మూర్తివి నీవవ్వాలి
కాననవాసా శ్రీ శబరీశా
నీ శరణం పలికించాలి
కలియుగమందు ఈ జగమందు
నీ చరణం కొలిపించాలి
చ) సంతసంబుతో మా హృదయాలు
ఎప్పుడు ఉప్పొంగాలి
సుఖదుఃఖాలందు ఎప్పుడూ స్వామి
నీమాట మా నోటుండాలి
గెలుపు ఓటములలో
నీ బాట మా బాటవ్వాలి
చ) సంసారమనే సాగరమందు
ఈ శరీరం నశ్వరము
మాయా మోహ ద్వేషభావాలు
ముక్తికి అవరోధం
మాలవేయించి దీక్షను స్వామి
మాతో చేయించు
ముక్తినొసగే శబరి శిఖరం
మమ్ముల ఎక్కించు
చ) కష్టసుఖాల కడలిని కలిలో దాటించు
పునరపి జననం పునరపి మరణం
భవబంధాలొదిలించు
తప్పొప్పులెంచక తత్వమసి
నీ తత్త్వం బోధించు
శరణార్థులము శరణాగత
నీ కరుణే కురిపించు
******************