ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్పా
13. అయ్యప్ప ...
ప) అయ్యప్ప నీ మాలవేసుకున్నాను
అయ్యప్ప నీ దీక్షలోన ఉన్నాను
మణికంఠ నా మనసందు నిన్నే నిలిపాను
శబరిగిరీశా నీ శరణం నిరతం పలికాను
స్వామి అయ్యప్ప ....
స్వామి శరణం అయ్యప్ప ...
చ) నీలిమలవాసా నియమం తప్పక
పాలనచేస్తున్నాను
నిష్ఠతో స్వామీ ఇరుసంధ్యలో
నిను పూజిస్తున్నాను
తప్పొప్పులు ఉంటే దేవా
దయతో మన్నించు
దండించాలనిపిస్తే నీ దాసుని దండించు
స్వామి అయ్యప్ప ....
స్వామి శరణం అయ్యప్ప ...
చ) కలియుగదేవా కరిమలవాసా
నీ కరుణే కోరాను
భక్తవిధేయ భజియించాలని
నీ భక్తునిగా మారాను
అయిదుకొండలవాడా
నీ అభయం అందించు
నాలోని ఆరుశత్రువులను
అంతమొందించు
స్వామి అయ్యప్ప ....
స్వామి శరణం అయ్యప్ప ...
చ) శరణాగతవత్సల శంభుకుమార
నీ శరణం పాడాను
చిన్ముద్రధారి శ్రీ చిద్విలాసా
నీ చరణం వేడాను
ఇరుముడిప్రియుడా నాతో
నీ ఇరుముడి కట్టించు
పదునెట్టాంబడివాసా
నీ పడు లే ఎక్కించు
స్వామి అయ్యప్ప ....
స్వామి శరణం అయ్యప్ప ...
*********************