ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్పా
14. సుందరరూపా ...
ప) సుందరరూపా సుమధురనామా
స్వామి అయ్యప్ప
శరణాధీశా శబరిగిరీశా
శరణం అయ్యప్ప
చ) నీపైనే మక్కువని
నీ మాలను వేశాము
నీవే మాకు ఎక్కువని
నీ దీక్షను బూనాము
అయిదుకొండలవాడా మా గుండెలలో
నిన్ను నిలుపుకున్నాము
చ) మా ఆప్తుడ నీవని
నీ చరణం వేడా ము
మా ఆత్మబంధువు నీవని
నీ శరణం పాడాము
పంచగిరుల పరంధామా
నిన్నే ప్రార్దించాము
చ) నీ స్మరణం పుణ్యమని
నీ నామం స్మరించాము
నీ స్పురణం ధన్యమని
నీ ధామం ధ్యానించాము
ఆపద్భాంధవా అయ్యప్ప
నిన్నారాధించాము
చ) మా ఇడుములు తీర్చమని
ఇరుముడులు కట్టాము
నీ చెంతకు చేర్చమని
శబరియాత్ర చేపట్టాము
పదునెట్టాంబడివాసా
నీ అండకోరుతున్నాము
**************