స్వామి గీతాలే పాడుదును నారద తుంబుర ధోరణిలో ||2||
జపమాల లేదండి చేతిలో మంత్ర శృతి మీటే తంబుర గానీ.. ఈ.ఈ.ఈ. ||2||
స్వామి అయ్యప్పస్వామి శబరిగిరిస్వామీ.... | ||2||
| స్వామి గీతాలే ||
ప్రాతః కాలాన పుణ్యక్షేత్రాన బంగరు నేలపై కురుచుని ||2|| స్వర్ణగిరినాధ అయ్యప్పా నిన్నే పుణ్యాక్షర గీతం పాడీ.. ||2|| ఏదో దివ్యానుభూతిని పొంది..
|| స్వామి గీతాలే ||
మనుషులొకటైన సత్యం నాకు మణికంధరస్వామి సెలవిచ్చే ||2||
మదమాత్సర్యాలు వలదే వలదని హితోపదేశం కావించే ||2|| మహితోపదేశం కావించే.. |
| స్వామి గీతాలే ||
ఉపదేశ సారాలు నన్నెంతో కదలించే.. నాలోని భావాలు రేపి ||2||
ఈ విశ్వమంతా నీ నామ స్మరణే మారుమోగేలాగ చేతూ.. మారుమోగేలాగ చేతూ.... ||2||
|| స్వామి గీతాలే ||
స్వామి అయ్యప్పస్వామి శబరిగిరిస్వామీ.....