ఘల్లు ఘల్లుమని మువ్వల సవ్వడులు ముద్దు బాలుడెవరే
వెన కొల్లగాని కృష్ణ పాదముల ఆనవాలు ఎవరే
ఆ… ఆ… ఆ…
గోకుల కృష్ణా గోపాల కృష్ణా మాయలు చాలయ్యా
మా కన్నులలో దీపాలు వెలిగె పండుగ తేవయ్యా
పదుగురి నిందెలతో పలుచన కాకయ్యా
నిలువని అడుగులతో పరుగులు చాలయ్యా
జయకృష్ణ, కృష్ణ, కృష్ణ, కృష్ణ, కృష్ణ హరే
గోకుల కృష్ణా గోపాల కృష్ణా మాయలు చాలయ్యా
మా కన్నులలో దీపాలు వెలిగె పండుగ తేవయ్యా
పదుగురి నిందెలతో పలుచన కాకయ్యా
నిలువని అడుగులతో పరుగులు చాలయ్యా
జయకృష్ణ, కృష్ణ, కృష్ణ, కృష్ణ, కృష్ణ హరే
దిననా, దీనననా, దీనన, దీనన, దీనననా
1. ఏనోట విన్నా నీవార్త లేనా
కొంటె చేష్ట లేలరా కోనంగినా
వూరంతా చేరి ఏమేమి అన్నా
కల్ల బొల్లి మాటలే – నారాధికా
చెలువలు చీరెలు దోచినా చిన్నెలు చాలవా
ద్రౌపది మానము కాచినా మంచిని చూడరా
తెలియని లీలతో తికమక చేయకయా
మంచిని చూడకురే మాటలు విసరకరా
జయకృష్ణ, కృష్ణ, కృష్ణ, కృష్ణ, కృష్ణ హరే
దిసనా, దీననా, దినననా, దీన దీన, దిననదిన నానా,
దినానానా, దినాననా, దీననా, దీనన, దినాననా
2. ఆవుల్ని కాచినా – ఆటలతో తేలినా
అంతలోనే ఆగినా ఆబాలుడూ
అవతార మూర్తిగా తన మహిమ చాటగా
లోకాన బాలుడూ గోపాలుడూ
ఆ తియ్యని మత్తున ముంచిన – మురళీలోలుడూ
మాయని దూరము చేసినా – గీతా చార్యుడూ
కనుకనె అతనికథా తరములు నిలిచెగదా
తలచిన వారి ఎడా – తరగని మధుర సుధా
జయకృష్ణ, కృష్ణ, కృష్ణ, కృష్ణ, కృష్ణ హరే
3. అల్లరి కన్నా ఓ నీలవర్ణా లీలలు మానయ్యా
అందెల సవ్వడిలో ముంగిట నిలిచెకదా
మువ్వల రవళితో గుండెలు మురిసె కదా
జయకృష్ణ, కృష్ణ, కృష్ణ, కృష్ణ, కృష్ణ హరే