మాధవా – రాధాలోలా
వెలసినావిలా – కృష్ణావతారా
నిన్ను కొలిచె భాగ్యము మాకు
కలుగెనా ఈ జన్మలోనా
మాధవా – రాధాలోలా
వెలసినావిలా – కృష్ణావతారా
నిన్ను కొలిచె భాగ్యము మాకు
కలుగెనా ఈ జన్మలోనా
1. నిన్ను కొలిచె నా హృదయములో
నిలువరాదా నా దేహములో
షుళ్లు షుళ్లున నటవిలోలా
వేగరా – గోపాల బాలా
మాధవా – రాధాలోలా
వెలసినావిలా – కృష్ణావతారా
నిన్ను కొలిచె భాగ్యము మాకు
కలుగెనా ఈ జన్మలోనా
2. మన్ను తిన్నావని యశోదా
నోరు చూచి నిను బంధించగ
మన్ను తిన్న చిన్ని నోటను
ఎల్లలోకములు చూపినావా
మాధవా – రాధాలోలా
వెలసినావిలా – కృష్ణావతారా
నిన్ను కొలిచె భాగ్యము మాకు
కలుగెనా ఈ జన్మలోనా
3. శిరమునా – చింతామణి కలదూ
నాలుకా – నక్షత్రము నీదూ
శంఖ చక్ర – గదాధారుడా
పక్షివాహనం – దైవమా
మాధవా – రాధాలోలా
వెలసినావిలా – కృష్ణావతారా
నిన్ను కొలిచె భాగ్యము మాకు
కలుగెనా ఈ జన్మలోనా
4. ఆది శేష పాన్పుపై పవళింపా
లక్ష్మీనీ పాదములు వత్తంగ
నారదాది మహా మునీంద్రులు
నిలచి గానము చేయగా
మాధవా – రాధాలోలా
వెలసినావిలా – కృష్ణావతారా
నిన్ను కొలిచె భాగ్యము మాకు
కలుగెనా ఈ జన్మలోనా