ఘల్ ఘల్ యని గజ్జెలు మ్రోగె నల్లనయ్యో
నల్లనయ్యో గంతులు వేయుచు చెంతకు రారా
తుంటరి కృష్ణయ్యా నీవు గంతులు వేయుచు
చెంతకు రారా తుంటరి కృష్ణయ్యా
1. బృందావనిలో నంద కిశోరా
గోకుల మందున గోపిక లోలా
చిందులు వేసే సుందర రూపా
భక్తులకే కనువిందులు చేయ
ఘల్ ఘల్ యని గజ్జెలు మ్రోగె నల్లనయ్యో
నల్లనయ్యో గంతులు వేయుచు చెంతకు రారా
తుంటరి కృష్ణయ్యా నీవు గంతులు వేయుచు
చెంతకు రారా తుంటరి కృష్ణయ్యా
2. చీరలెత్తుకొని చెట్టులెక్కియు
చల్ల ముంత్తలను కొల్లగొట్టియు
మన్ను తిన్న నీ చిన్ని నోటను
ఎల్లలోకములు చూపినట్టియు
ఘల్ ఘల్ యని గజ్జెలు మ్రోగె నల్లనయ్యో
నల్లనయ్యో గంతులు వేయుచు చెంతకు రారా
తుంటరి కృష్ణయ్యా నీవు గంతులు వేయుచు
చెంతకు రారా తుంటరి కృష్ణయ్యా
3. పిల్లనగ్రోవిని ఊదుచురారా
యుల్లము ఘల్లని చల్లని దేవా
రాధా మాధవా మానస చోరా
మమ్ముల గావర నీల శరీరా
ఘల్ ఘల్ యని గజ్జెలు మ్రోగె నల్లనయ్యో
నల్లనయ్యో గంతులు వేయుచు చెంతకు రారా
తుంటరి కృష్ణయ్యా నీవు గంతులు వేయుచు
చెంతకు రారా తుంటరి కృష్ణయ్యా