అక్కా చెల్లి వింటారా రామా కధను చెపుతాము
రామా కథను చెపుతాము శ్రీరామా కథను జెపుతాము
1. పాల కడలిలో శేషపాన్పుపై పవళించాడు శ్రీ విష్ణువు
ప్రక్కన లక్ష్మి కూర్చుంది పాదము లొత్త సాగింది
అక్కా చెల్లి వింటారా రామా కధను చెపుతాము
రామా కథను చెపుతాము శ్రీరామా కథను జెపుతాము
2. రాక్షస బాధలు పడలేక దేవలంతా మొర విడగా
స్వామి నిదుర లేవక ముందె తల్లి అభయ మిచ్చినది
అక్కా చెల్లి వింటారా రామా కధను చెపుతాము
రామా కథను చెపుతాము శ్రీరామా కథను జెపుతాము
3. వెంటనె విష్ణువు దశరధునింట రామావతారం ఎత్తాడు
శంఖు, చక్రము శేషుని తోడ రాముని సోదరులయ్యారు
అక్కా చెల్లి వింటారా రామా కధను చెపుతాము
రామా కథను చెపుతాము శ్రీరామా కథను జెపుతాము
4. వెంటనె లక్షి జనకుని ఇంట చక్కని సీతై వెలసింది
శివధనుస్సు విరసిన శ్రీరాముడు సీతను పరిశీయం మాడాడు
అక్కా చెల్లి వింటారా రామా కధను చెపుతాము
రామా కథను చెపుతాము శ్రీరామా కథను జెపుతాము
5. విశ్వామిత్రుని యాగము కాచి రాక్షసమాయను అరికట్టి
మానవ మూర్తిగ వెలసితివే మహాత్ముడై వెలుగొంతివే
అక్కా చెల్లి వింటారా రామా కధను చెపుతాము
రామా కథను చెపుతాము శ్రీరామా కథను జెపుతాము