Yamuna Thirana Lyrics || యమునా తరాన లిరిక్స్ - కృష్ణుడి భజన పాట

P Madhav Kumar


యమునా తరాన నీ వేణు గానం
యదరగిలించే ఎనలేని మధురము

యమునా తరాన నీ వేణు గానం
యదరగిలించే ఎనలేని మధురము

1. నీ ప్రియవదనం వికసిత జలజం
నీ మృధు వీక్షణం జాబిలి కిరణం
నీ దరహాసం ఆమని జననం
నీ శుభ చరణం ఈరాధశరణం

యమునా తరాన నీ వేణు గానం
యదరగిలించే ఎనలేని మధురము

2. నీ చేరువలో యుగమే క్షణము
నీ దూరములో క్షణమే యుగము
ఆరాధనలో ఆలాపనలో
నిరతము నీవే ఈ రాధ శరణం

యమునా తరాన నీ వేణు గానం
యదరగిలించే ఎనలేని మధురము

3. శృతి నీవైతే రాగము నేను
శశి నీవైతే తారను నేను
నిలిచెను నాలో నీ అవతారము
నిరతము నీవే ఈ రాధ జీవము

యమునా తరాన నీ వేణు గానం
యదరగిలించే ఎనలేని మధురము

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat