మనసార హరిభజన చేయరా
నోరారా నారాయణ అనరా
నీ నోరారా నారాయణ యనరా
1. పాటే రాదని ప్రజలు నగుదురని
గాత్ర సుద్ధియే కమ్మగ లేదని
పాటకు సరియగు తాళము లేదని
భయము, బిడియము, బాధ వలదురా
మనసార హరిభజన చేయరా
నోరారా నారాయణ అనరా
నీ నోరారా నారాయణ యనరా
2. పాటకు తాళము గాత్ర మున్నను
మనసే లేని స్మరణేయి వృధరా
మనసొక చోట తనువొక చోట
ఉన్న మానవుని జన్మమె వుదరా
మనసార హరిభజన చేయరా
నోరారా నారాయణ అనరా
నీ నోరారా నారాయణ యనరా
3. యోసలైనా మహా భోగులైనా
పూర్వజన్మ సుకృత మేరా
నారాయణ నీ నామ స్మరణచే
నరకపు బాధలు తొలగిపోవురా
మనసార హరిభజన చేయరా
నోరారా నారాయణ అనరా
నీ నోరారా నారాయణ యనరా