Nallanayyaa Nandhabalaa Lyrics || నల్లనయ్యా నంద బాలా లిరిక్స్ – కృష్ణుడి భజన పాట

P Madhav Kumar

 

నల్లనయ్యా నంద బాలా బాల గోపాలా
జాలమేల వేణుగానవి లోల రావేలా

1. నిన్ను కన్నుల చూడగానే నెంత కాలము వేచినా
ముద్దు మోము చూపకుందువా
కొద్ది వాడని నాపై శ్రద్ధ లేకేనా

నల్లనయ్యా నంద బాలా బాల గోపాలా
జాలమేల వేణుగానవి లోల రావేలా

2. అందమే బృందావనీ అని ఆటస్థలమై పోయేనా
ఆట పాటలు చూచు భాగ్యము
మాకు ఇక లేదా నా దరికి రారాదా

నల్లనయ్యా నంద బాలా బాల గోపాలా
జాలమేల వేణుగానవి లోల రావేలా

3. గజ్జెలందెలు ఝల్లన నా యుల్ల మనరుచు
ఝల్లన వెన్నదొంగా వేగరారా సన్నుతించితిరా
నిన్నే, నమ్మి యుంటి నిరా

నల్లనయ్యా నంద బాలా బాల గోపాలా
జాలమేల వేణుగానవి లోల రావేలా

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat