రామా రమ్మని పిలచితిరా రామా రమ్మని పిలచితిరా
జాగేలరా జగదాబి రామా దాసుల బ్రోవుమురా
రామ దాసుల బ్రోవుమురా
రామా రమ్మని పిలచితిరా రామా రమ్మని పిలచితిరా
జాగేలరా జగదాబి రామా దాసుల బ్రోవుమురా
రామ దాసుల బ్రోవుమురా
1. దశరధ తనయా రామా
దశకంఠ సంహారా రామా
దరి జేర్చుమురా రామా
నీ దయ కోరితమో రామా
రక్షించినా, పోషించినా రఘువీర నీవే రామా
రామా రమ్మని పిలచితిరా రామా రమ్మని పిలచితిరా
జాగేలరా జగదాబి రామా దాసుల బ్రోవుమురా
రామ దాసుల బ్రోవుమురా
2. భోసుల మెలిమి రామా – మేమే పాపము లెరుగమురా
శబరి అహల్యను రామా – నీవు కడతేర్చగ లేదా
కరుణించినా కనకుండినా భారంబు నీదే రామా
రామా రమ్మని పిలచితిరా రామా రమ్మని పిలచితిరా
జాగేలరా జగదాబి రామా దాసుల బ్రోవుమురా
రామ దాసుల బ్రోవుమురా
3. దీన దయాకర రామా – ఈ దీనుల మొర విను రామా
కౌసల్యా తనయా రామా – కారుణ్య సుధాకర రామా
భరియించగా భద్రాద్రి రామా భారము నీదే రామా
రామా రమ్మని పిలచితిరా రామా రమ్మని పిలచితిరా
జాగేలరా జగదాబి రామా దాసుల బ్రోవుమురా
రామ దాసుల బ్రోవుమురా