సాయంకాలము సమయములో – సంద్యా దీపారాధనలో
వచ్చును తల్లి వరలక్ష్మి – వచ్చును తల్లి వరలక్ష్మి
సాయంకాలము సమయములో – సంద్యా దీపారాధనలో
వచ్చును తల్లి వరలక్ష్మి – వచ్చును తల్లి వరలక్ష్మి
1. పాల సంద్రుని పుత్రికరా – పరంధాముని ప్రాణసతో
రావమ్మా ఇక రావమ్మా – మము కరుణించగ రావమ్మా
సాయంకాలము సమయములో – సంద్యా దీపారాధనలో
వచ్చును తల్లి వరలక్ష్మి – వచ్చును తల్లి వరలక్ష్మి
2. విద్యను ఇచ్చే విద్యాలక్ష్మి – సంతాన మిచ్చే సంతానలక్ష్మి
సౌభాగ్య మిచ్చే సౌభాగ్యలక్ష్మి – ధైర్యము నిచ్చే ధైర్యలక్ష్మి
సాయంకాలము సమయములో – సంద్యా దీపారాధనలో
వచ్చును తల్లి వరలక్ష్మి – వచ్చును తల్లి వరలక్ష్మి
3. మెడలో ఎన్నో హారాలు – సిగలో ఎన్నో పువ్వులు
నవ్వుతు వచ్చును మాతల్లి – మము కరుణించుము మాతల్లి
సాయంకాలము సమయములో – సంద్యా దీపారాధనలో
వచ్చును తల్లి వరలక్ష్మి – వచ్చును తల్లి వరలక్ష్మి
4. మము కరుణించును మాయమ్మా – మము కాపాడుము మాయమ్మా
మము దయ చూడము మాయమ్మా – మము దరిచేర్చుము మాయమ్మా
సాయంకాలము సమయములో – సంద్యా దీపారాధనలో
వచ్చును తల్లి వరలక్ష్మి – వచ్చును తల్లి వరలక్ష్మి