_*🚩అయ్యప్ప చరితం - 19 వ అధ్యాయం🚩*_

P Madhav Kumar



🕉☘️🕉️☘️🕉️☘️🕉️☘️🕉️☘️🕉️


సృష్టి స్థితి లయలనే ఈ మూడు కార్యాలు మూడు రూపాలలో తానే నిర్వహిస్తుంటాడు నిర్గుణ పరబ్రహ్మమైన భగవంతుడు ! కర్మభూమి అయిన ఈ భూలోకంలో మానవ శరీరాలతో నిర్గుణ పరబ్రహ్మ జీవాత్మగా హృదయ స్థానంలో వెలుగొందుతాడు !  తల్లి గర్భం నుండి శిశువుగా జన్మించి క్రమంగా బాల్య , కౌమార , యవ్వన , వృద్ధాప్యం అనే నాలగు అవస్థలు అనుభవించి , కర్మలు ఆచరించి వాటికి అనుగుణంగా మరణానంతరం ఆ జీవిలోని ఆత్మ మరో శరీరాన్ని ధరాణ చేస్తుంది !

గురుపుత్రా ! బ్రహ్మజ్ఞానం పొందనీయకుండా మాయ అనబడే అరిషడ్వర్గాలుగల పొర (కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు) జీవాత్మను కప్పి వుంచుతుంది ! అందుచేత వాటి ప్రభావానికి లోనై పరబ్రహ్మను  చూసే అవకాశాన్ని , అదృష్టాన్ని పోగొట్టుకుంటాడు !  నీ విషయంలో జరిగిందదే ! అరిషడ్వర్గాలకు లోబడి పూర్వజన్మలో అనేకమైన పాపకర్మలు చేసి జ్ఞానం పొందలేకపోయావు ! నీలోనే వెలిగే ఆ జ్ఞానజ్యోతిని చూడలేకపోవటమే అంధత్వానికి కారణం ! మనస్సనే సరోవరంలో హంసరూపంలో వెలిగే జవాత్మ శరీరంలోని గుప్తమైన నాడీ స్థానాలలో ఆగుతూ పైకి శిరస్సువైపు ప్రయాణిస్తూ వుంటుంది ! అదే యోగమార్గం ! ఆ మార్గంలో మూలాధార చక్రం మీద కింకిణీనాదంగానూ , స్వాధిష్ఠాన చక్రం దగ్గర వేణుగానంగానూ , మణిపూరక చక్రం దగ్గర వీణానాదంగానూ , అనాహత చక్రం దగ్గర శంఖనాదంగాను , విశుద్ధ చక్రం దగ్గర మేఘనాదంగానూ (ఉరుము శబ్దం), ఆజ్ఞాచక్రం దగ్గర సముద్ర ఘోషలాగా , సహస్రార చక్రం దగ్గర తుమ్మెద ఝంకారంలాగానూ ఓంకారం తిరుగుతుంటుంది !  ఈ నాదం అజ్ఞానులకు వినిపించదు ! అదే ఏమీ వినిపించని చెవిటితనం ! ఇక ఈ రెండు కార్యాలు జ్ఞానేంద్రియాలు చేయడానికి సమర్థవంతం కానప్పుడు మూగతనం వస్తుంది ! భగవంతుని కీర్తించే అవకాశం వుండదు ! స్తబ్దుడుగా వుండిపోతుంది జీవాత్మ ! ఇంతకాలం నీవున్నది ఆ జడావస్థలోనే ! ఇప్పుడు వాటిలో చైతన్యం ప్రవహిస్తున్నది ! నీలోని జీవాత్మ అరిషడ్వర్గాలను జయించి పరమాత్మను చేరడానికి (మరు జన్మలేని ముక్తిని) యోగమార్గంలో సాధన చేయి ! ఓంకరాన్ని జపిస్తూ వుండు ! క్రమంగా బ్రహ్మజ్ఞానం అంటే అవగాహన ఏర్పడుతుంది !’’ అని ఉపదేశించాడు శాంత , గంభీర స్వరంతో !

*‘‘ధన్యులం ఓంకారరూపా ! మణికంఠా ! మీ కివే మా కోటి కోటి ప్రణామాలు!’’* అంటూ కృతజ్ఞతాపూర్వకంగా నమస్కరించారు గురు , ఆయన కుమారుడు ! గురువు అనుమతి తీసుకుని రాజధానికి తిరిగి వచ్చాడు మణికంఠుడు ! అప్పటికి పదేళ్ల వాడయినాడు ! తల్లిదండ్రుల కంటి వెలుగుగా , ప్రజల కష్ట , సుఖాలు స్వయంగా అడిగి తెలుసుకుంటూ జనరంజకంగా ప్రజాహిత కార్యాలు చేస్తూ ఆదర్శంగా పాలన జరుపుతున్నాడు ! ప్రయోజకుడైన కుమారుడికి పట్టాభిషేకం చేసి తాను విశ్రాంతి తీసుకోవాలన్న ఆలోచన కలిగింది రాజశేఖరుడికి !

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏



#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat