*శ్రీ హనుమ కధామృతము 31*

P Madhav Kumar


గరుడ ,సత్య భామ ,నారద తుంబురుల గర్వ భంగం 

విష్ణు మూర్తి వాహనం పక్షి రాజైన గరుత్మంతుడు .అతి బాల శాలి .ఇంద్రుడు ఒక సారి గరుడిని వజ్రాయుధం తో కొడితే ఒక్క వెంట్రుక మాత్రమె ఊడింది .అంతటి శక్తి సంపన్నుడు .అతని పేరు చెబితే పాములన్నీ వణికి పోతాయి .అంట బలశాలి గరుడినిని హనుమ తన తోక లోని ఒక్క వెంట్రుకతో నెల మీద పడేట్లు చేశాడు .

ద్వారకలో శ్రీ కృష్ణ పరమాత్మ ఉన్న రోజు లవి .సత్యభామకు శ్రీ కృష్ణుడు తనను బాగా లాలిస్తున్నాడని గర్వం గా వుండేది .ఆ మాట బాహాటం గా చెప్పు కొనేది .నరకాసుర సంహారం ,పారిజాత వృత్తాంతం ఆమె గర్వాన్ని మరీ పెంచేశాయి .స్వర్గం లోని పారిజాత వృక్షాన్ని పెకలించి తెచ్చేటప్పుడు గరుడు డితో”నువ్వు ఉండ బట్టి ఇంతటి మహత్కార్యం జరిగింది ”అన్నాడు స్వామి .దానికి ఉబ్బి తబ్బిబ్బై గర్వం పొడ చూపింది .వీరి అందరి గర్వాన్ని ఎలా అణచాలా అని ఉపాయం కోసం వెతుకు తున్నాడు కృష్ణుడు . 

ఒక సారి కైలాసం లో పార్వతీ పరమేశ్వర సందర్శనం చేసి ,నారద తుమ్బురులు నాద ప్రియుడైన ఆయన్ను తమ గాన ప్రావీణ్యం తో మెప్పించారు .వారిద్దరి గాన మాధుర్యానికి శివుడు అభినందించాడు .అది వాళ్లకు సంతృప్తి కల్గించ లేదు .తమరిద్దరి లో ఎవరి గానం గొప్పదో తెలియ జేయ మన్నారు .బ్రహ్మ వద్దకు వెళ్లి తేల్చుకో మన్నాడు పరమేశ్వరుడు .అక్కడికి వెళ్తూ దారిలో ఎవరికి వారు తానే ఎక్కువ అని కలహించుకొన్నారు . సంగీత ,సాహిత్యాది దేవత సరస్వతీ దేవి అక్కడే వుంది .విరించి వీరి గర్వం ముదిరిందని తెలిసి ద్వారకలో శ్రీ కృష్ణుడే సరైన న్యాయ నిర్ణేత అక్కడకు వెళ్ళ మని సలహా ఇచ్చాడు .

ద్వారకలో సత్యభామా మందిరం లో కృష్ణ సందర్శనం చేశారు .వారిద్దరికీ మర్యాద పూర్వక స్వాగతం పలికాడు .వచ్చిన పని ఏమిటని అడిగాడు .నాద విద్యా హన్కారం తో విర్ర వీగే వారిద్దరూ తమలో ఎక్కువ తక్కువలు తేల్చమని కోరారు .అప్పుడు ఆయన ”సకల విద్యా రహశ్య వేది ,సకల వేద సార గ్రహీత ,భవిష్యత్ బ్రహ్మ అయిన హనుమ మాత్రమె దీనికి సమర్ధుడు ”అని చెప్పి గరుత్మంతుణ్ణి వెళ్లి వెంటనే హనుమకు విషయం వివరించి తీసుకొని రమ్మనాడు .అసలే బల గర్వం లో ఉన్న గరుడుడు ”ఒక కోతిని తీసుకు రావటానికి నా అంత బలవంతుడు వెళ్ళాలా ?పని చెప్పేటప్పుడు హెచ్చు తగ్గులు చూసి చెప్పాలి .నన్ను తేలిక చేసే శారు .అయినా ప్రభు ఆజ్న .వెళ్తున్నాను ”అప్పుడు సత్యా వల్లభుడు ”ఇది నీకు అవమానం కాదు .గౌరవమే .సాక్షాత్తు ఈశ్వర భక్తుడు ,భవిష్యత్ బ్రహ్మ అయిన హనుమ సందర్శనం సామాన్యం కాదు .గంధ మాదనం వద్ద కదళీ వనం లో నిరంతర తపో ,ధ్యానం తో ఉంటాడు హనుమ .నువ్వే వెళ్లి తీసుకు రా గల సమర్దుడివి ”

అన్నాడు .అయినా సందేహిస్తూనే బయల్దేరుతూ ఆ వానరున్ని పిలుచుకోస్తానని ఒక వేళ కుదరక పొతే తన బలమేమిటో ప్రదర్శించి వచ్చేట్లు చేస్తానని బీరాలు పలికి వెళ్ళాడు .

తోకను చుట్ట గా చుట్టి కోట లాగా ఏర్పరచి దాని మధ్య కూర్చుని వున్నాడు హనుమ .గరుత్మంతునికి స్వాగతం ఇవ్వ లేదు .ధ్యాన నిమగ్నం గా వున్నాడు .మండి పోయాడు .కోతికి మర్యాదాలెం తెలుసు అన్నాడు .దిక్కులు వణికే టట్లు రెక్క లను విసిరాడు .ముక్కుతో పొడిచాడు .గోళ్ళ తో చీరాడు .హనుమ తోకను కదిలించాలని విశ్వ ప్రయత్నం చేశాడు .సాధ్యం కాలేదు .తోక కోటలోకి ప్రవేశిద్దా మని యెగిరి తే సూర్యుని ముందు మిణుగురు పురుగు అని పించాడు .తనను కోతి అవ మానిన్చిందని రగిలి పోయాడు .చివరికి ఓపిక నశించి ”కపీన్ద్రా !ద్వారక లోని కృష్ణుడు నిన్ను పిలుచుకు రమ్మన్నాడు ”అని పొడి పొడి మాటలతో అన్నాడు .రామ భక్తి సామ్రాజ్యం లో లీన మైన హనుమకు ఇదేమీ తెలియదు .

మళ్ళీ గోళ్ళతో ,ముక్కుతో గాయాలు చేశాడు .తోకనుకొంచెం ఝాదించాడు హనుమ .దానికే కంగు తిని ముచ్చెమటలు పట్టి నెల వ్రాలాడు .తోక దెబ్బతో ఒక్క సారి యెగిరి వచ్చి ద్వారక లో శ్రీ కృష్ణుని ముందు పడ్డాడు .గరుడ గర్వ భంగం తెలుసు కొని ఓదారుస్తూ సపర్యలు చేశాడు గాయాలకు /.తేరుకున్న వైనతేయుడు కళ్ళు తెరిచాడు .”వివేకివి అని నిన్ను పంపాను .అక్కడ రామ నామ జపం లో మునిగి ఉన్న హనుమను ,నీ బల గర్వం తో రెచ్చ గొట్టి ,ఫలితం అనుభ విస్తున్నావు కదూ “/అన్నాడు .సిగ్గుతో తల వాల్చాడు వినతా సుతుడు .”మీ ఉపదేశాన్ని పెడ చెవి పెట్టి నందుకు నాకు మంచి శాస్తి జరిగింది ”అని ఏడ్చాడు .స్వామి అనునయం గా ”ఎవరికైనా లోకం లో ఒక్కో సారి బుద్ధి పెడ దారి తొక్కు తుంది .

”సీతా రాములు పిలుస్తున్నారు ”అని ఈ సారి వెళ్లి మర్యాద గా పిలువు .పరవశం తో వచ్చి ఇక్కడ వాల్తాడు ”అని చెప్పాడు గరుడునికి శ్రీ రామ మంత్రోప దేశం చేశాడు పరమాత్మశ్రీ కృష్ణ భగ వానుడు .


 *సశేషం....*

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat