🙏🙏 *శ్రీ వేంకటేశ్వర వైభవం - 35* 🙏🙏

P Madhav Kumar


*🌻2.తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఉత్సవములు🌻*


*🌻23. బ్రహ్మోత్సవము🌻*


🍃🌹శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడై (తిరుమల) శ్రీ శేష పర్వతమునందు భక్తజన కామితార్థ ప్రదుడై అర్చావతారమున వేంచేసి యున్న శ్రీ వేంకటేశ్వరస్వామివారికి ప్రతి సంవత్సరము కన్యామాసము నందు (ఆశ్వయుజ మాసమునందు) శుక్లపక్షమున శ్రవణ నక్షత్రము నందు అవభృథమును (చక్రస్నానమును) సంకల్పించి తొమ్మిది దినములు ముందుగా ధ్వజారోహణము చేయబడును. అందుకు పూర్వదినమున అంకురార్పణము చేయబడును. ఈ దినమున సాయం కాలము శ్రీ విష్వక్సేనులవారికి (సేనాధి పతివారికి) చతుర్వీథుల ఉత్సవము చేయబడును. మృద్ధహణము కూడా జరుగును. దేవాలయమునకు వేంచేసిన తరువాత యాగశాలయందు అంకురార్పణము జరుగును. 


🍃🌹తరువాత తొమ్మిది దినములలో మొదటి దినము సాయంకాలము ధ్వజారోహణము జరిగి ప్రతి దినము ఉదయము రాత్రి ఆయా నిర్ణీత వాహనములతో శ్రీ స్వామివారికి ఉత్సవములు జరుగును. ఇదియే బ్రహ్మోత్సవము, విశేష మేమన - మూడు సంవత్సరములకొక పర్యాయము అధి క మాసము వచ్చినప్పుడు రెండు ఉత్సవములు జరుగును. మొదటి ఉత్సవము మామూలు బ్రహ్మోత్సవము ప్రకారము జరుగును. రెండవ నవరాత్రి ఉత్సవముల యందు ధ్వజారోహణము, రథము ధ్వజావరోహణము లేకనే జరుగును. నవరాత్రి ఉత్సవములయందు ప్రతిదినము పగలు రాత్రి రంగమండపమునందున్న పెద్దశేషవాహనము పై శ్రీ మలయప్ప స్వామివారిని ఉభయనాంచార్లను ఉత్సవానంతరము వేంచే పుచేసి ఆస్థానము జరుగును.


🍃🌹భవిష్యోత్తర పురాణము శ్రీస్వామివారి బ్రహ్మోత్సవమును గూర్చి ఇట్లు చెప్పుచున్నది. బ్రహ్మదేవుడు ఉత్సవమునకు ఆహూతులైన మహర్షులతోటి, మహారాజులతో, భక్త జనకోటితో, చతురంగబలములతో నిబిడీకృతమైన శ్రీ వేంకటాద్రియందు కన్యా మాసమున ప్రతిపద్దినమునందు శ్రీ వైఖానసులచేఁ బ్రహ్మోత్సవమునకు అంకురార్పణము చేయించి ద్వితీయ దినమునందు రత్నమయమగు నరయానమున ఉత్సవ శ్రీనివాసస్వామివారిని వేంచేపు చేయించి చైత్య ప్రదక్షిణము కావించి ధ్వజారోహణము నిర్వర్తించెను.


🍃🌹ఆగమ శాస్త్రము:- ఈ ఉత్సవము బ్రహ్మసంఖ్యాకమగు తొమ్మిది దినములు జరుగుటచేత సర్వకామప్రదమగు బ్రహ్మోత్సవము అని చెప్పుచున్నది.


🍃🌹పరం బ్రహ్మయగు సర్వేశ్వరుని ఉత్సవమగుటచేత నీ ఉత్సవ మును బ్రహోత్సవమని సంప్రదాయ వేత్తలు చెప్పుచున్నారు. ఇప్పుడు బ్రహ్మోత్సవానంతరము పరదినమున పుష్పయాగ మహోత్సవము జరుగుటలేదు.



*🙏ఓం నమో వేంకటేశాయ🙏*

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat