*హనుమ భీమునికి బోధించిన కాల మహిమ:*
— సముద్రాన్ని దాటిన హనుమ రూపాన్ని చూపించ మని కోరిన భీముని తో హను ”సోదరా !అప్పటి రూపాన్ని చూప మంటే ఎలా ?కాల భేదం వచ్చింది కదా.త్రిమూర్తులు కూడా కాలానికి బందితులే .కాల స్వరూపాన్ని వివ రిస్తాను .తెలుసు కో ”అన్నాడు
కాలం లో కాదు (స్మశానం ),వీడు (పట్టణం )అవుతుంది .మంచి ,చెడు కాలం లోనే కలుగుతాయి .పొద్దున్న ఉన్న పద్మ సౌందర్యం సాయంకాలం వుండదు కదా .రాత్రి వికసించే కలువల సౌరు పగలు మాయమవు తుంది .వర్షా కాల మేఘ గర్జన ,శరత్కాలం లో రాదు .పున్నమి నాటి చంద్ర కాంతి ,అమావాశ్య నాడు ఉందనే వుండదు .వసంత శోభ శిశిరం లో రాదు .ఇదంతా” కాలా పేక్ష ”అంటారు .అంతా కాలా పెక్షే .ఏఏఏ శరీరానికి బాల్య కొమార , ,యౌవన వ్రుద్దాప్యాయాలు అనే నాలుగు దశ లున్నాయి .వృద్ధాప్యం వచ్చిన తర్వాతా మళ్ళీ బాల్యం రాదు కదా .ఒక్క రోజు లోనే ప్రకృతి లో అనేక మార్పు లు వస్తాయి .అలాగే యుగ ధర్మాలు మారుతూ వుంటాయి .యుగాలు నాలుగు .యుగ ధర్మాలు వాటిని అనుసరించే వుంటాయి ., .
కాల తత్వాన్ని వివరిస్తాను విను .కాలం ఆది ,అంతం లేనిది .సర్వ వ్యాపి .కాలమే పరమాత్మ .స్త్రీ లింగ రూపం లో ”కాళి ”అంటారు అదే శక్తి రూపం .ఈమె అన్ని లోకాలను రోజు వంట చేస్తూ ,ఆరగిస్తూ వుంటుంది .పాచకత్వమే (వంట చేయటమే )కాల స్వరూపం ..ఆమె చేత అనేక అన్దాండ ,పిండాండ ,బ్రహ్మాండాలు సంహరిమ్పబడినాయి .ఆ సంహార శక్తి కి చిహ్నం గా ఆమె మెడ లో పుర్రెల మాల వుంటుంది .సృష్టి యొక్క ఈ సంహార శక్తినే ”నిత్య సంగ్రామ కారిణి ”అని పిలుస్తాం .కాళీ మాత ఉపాసకులు సృష్టి యొక్క విభూతిని స్త్రీ యందె ఆరోపిస్తారు .ఈమె దశ మహా విద్యలలో సృష్టికి కారణ భూతుడైన సత్పురుషుడు లేక మహా కాలుని నిత్య తాండవ వైభవ మే ”కాళి ”.ఆ మహా కాలుడు లేక సదా శివుడే మోక్ష ప్రదుడై ,25 మూర్తులుగా విరాజిల్లుతూ పూజలు అందుకొంటున్నాడు . కోతున్నాడు .అందులో ”నృత్య విలాసిని ”అయిన నట రాజ మూర్తి స్వరూపం ఒకటి .అదే తాండవ మూర్తి .ఆ తాండవం సంధ్యా ,కాలిక ,విజయ ,ఊర్ధ్వ ,ఉమా ,సంహార ,అనే ఏడు రకాల తండ వాలుగా పిలవ బడుతోంది .ఈ సప్త తండ వాలే కుండలిని విద్యలో సహస్రారం తో కలిసిఏడు భూమికలు గా చెప్పా బడింది .సమస్త జనుల లో ఈ కుండలిని నిత్య తాండవం చేస్తుంది .ఉపాసకుడు ఆరు చక్రాలు భేదించి ,సహస్రారం లో ఐక్య భావాన్ని ,పొంది ,అద్వైత స్థితి లో వున్నప్పుడు మిగిలేది అఖండ అద్వైతానందమే .ఈ స్థితినే ”ఆనంద తాండవం ”అంటారు .
చలన క్రియ అంత తాండవమే .స్పందన ప్రాణ శక్తి విలాసమే .సృష్టి ,స్థితి ,లయము ,తాళ బద్ధ మైన చలనం లో నే సాగి పోతాయి .పరిణామ శక్తి అయిన కాళీ శక్తి కేవలం సంహారానికే కాక ,సృష్టికి కూడా కారణ భూతం అవుతుంది .”నేను భువన సృష్టిని ప్రారంభించ టానికి వాయువు లాగా అన్ని చోట్ల ప్రవహిస్తాను .”అనే వేద మంత్రం వాయువుకు ప్రాధాన్యత నిచ్చింది .సాహిత్య పరంగా వీర ,శృంగార అపురూప దర్శనం ఇదే .ఈ వైభవం వల్లే జగత్తు కు పరమ కారణం అయిన శివుడు అయాడు .పరమ శివుడే సదా శివుడు .
ఈ సమష్టి శక్తి అనే ప్రక్రుతి శక్తి అన్ని ప్రాణులను ఆవేశించి వుంది .అందు వాళ్ళ ఆ శక్తే వ్యష్టి శక్తి (వికృతి శక్తి )గా మారు తుంది .సూర్యుని కాంతి చంద్రుని పై పడి ,ప్రతి ఫలించి ,వెన్నెల గా మారుతోంది .ప్రపంచానికి కారణ మైన సమష్టి శక్తి ,ప్రాణి కోట్లను ఆశ్రయించి ,కుండలిని శక్తి గా పిలువ బడు తోంది .
*సశేషం....*