🌼🌿దక్షిణామూర్తి స్వరూపం🌼🌿

P Madhav Kumar



"దక్షిణామూర్తి" విగ్రహాన్ని పరిశీలిస్తే "కుడిచెవి"కి "మకరకుండలం"... ఎడమ చెవికి "తాటంకం' అలంకారాలుగా కనిపిస్తాయి. 


"మకరకుండలం" పురుషుల శ్రవణాలంకారం. "తాటంకం" స్త్రీల అలంకృతి...

దక్షిణామూర్తిగా సాక్షాత్కరించినది "శివశక్తుల" సమైక్య రూపమేనని తెలియజేస్తాయి... 

ఈ రెండు అలంకారాలు. 


సనకసనందనాదులకు ముందు రెండుగా కనబడిన శివశక్తులే... ఇప్పుడు ఏకాకృతిగా దర్శనమిచ్చాయి. 


అందుకే దక్షిణామూర్తి అయ్యరూపమే కాక, అమ్మమూర్తి కూడా..

ఈ విషయాన్నే "లలితాసహస్రం"లో దక్షిణామూర్తి రూపిణీ సనకాదిసమారాధ్యా శివజ్ఞాన ప్రదాయినీ" 

అని వివరిస్తోంది.


స్వామి ఉత్తరాభిముఖులై ఉంటారు. 

ఉత్తరం జ్ఞానదశ.... ఆ దిశలో కూర్చున్న స్వామిని చూస్తూ ఉన్నవారికి....


వెనుక భాగాన ( పృష్ట భాగాన ) దక్షిణ దిశ. 

అంటే యమ (మృత్యు) దిశ. 

దీని భావం ఎవరు దేవుని వైపు చూస్తారో... వారు యముని ( మృత్యువుని ) చూడరు. 


యముని చూపు మనపై పడకుండా స్వామి చూపు 'నిఘా', వేస్తుంది. 

 

 ప్రమాదం వై మృత్యుమహం బ్రవీమి' 


యముని సైతం శాసించిన మృత్యుంజయుడే దక్షిణామూర్తి


దక్షిణ' అంటే 'దాక్షిణ్య భావం'.


ఏ దయవలన దుఃఖం పూర్తిగా నిర్మూలనం అవుతుందో ఆ 'దయ'ను 'దాక్షిణ్యం' అంటారు. 


ఈ లోకంలో శాశ్వతంగా దుఃఖాన్ని నిర్మూలించగలిగే శక్తి (దాక్షిణ్యం)... భగవంతునికి మాత్రమే ఉంది. 

ఆ దాక్షిణ్య భావం ప్రకటించిన రూపమే... "దక్షిణామూర్తి"


అన్ని దుఃఖాలకీ కారణం అజ్ఞానం. 

అజ్ఞానం పూర్తిగా తొలగితేనే శాశ్వత దుఃఖ విమోచనం. 

ఆ అజ్ఞానాన్ని (అవిద్యను) తొలగించే...జ్ఞాన స్వరూపుని దాక్షిణ్య విగ్రహమే "దక్షిణామూర్తి"


గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణామ్  నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమ:🙏


"దక్షిణామూర్తి" సకల జగద్గురు మూర్తి కనుక  స్వామి ఆరాధన సకల విద్యలను ప్రసాదిస్తుంది. ఐహికంగా బుద్ధి శక్తిని వృద్ధి చేసి విద్యలను ఆనుగ్రహించే ఈ స్వామి...

పారమార్థికంగా తత్త్వ జ్ఞానాన్ని ప్రసాదించే దైవం.

.

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat