అన్ని సేవలయ్యెనయ్య హరిహరాత్మజా
అన్ని సేవలయ్యెనయ్య హరిహరాత్మజా
ఆలకించి ఆదుకొనుము అయ్యప్ప దేవా.... |అన్ని|
ప॥ కంటి నీదు దివ్య అభిషేకము స్వామి
అంటి ఉప్పొంగి నీదు చరణాలే శరణమని. |కంటి|
1 చేసితి నీకు దివ్య అలంకారము
నవరత్న కచిత బంగారు ఆభరణములు (2)
అష్టోత్తర నామాలతో అర్చన చేసి (2)
పాయాస నైవేద్యం అర్పణ చేసి. |కంటి|
2 అలరారిన నీకు మంగళ హారతినిచ్చి
వేద మంత్రపుష్పాలతో కొలిచానయ్యా
కంటి నీదు దివ్య అలంకారము స్వామి
అంటి ఉప్పొంగి నీదు చరణాలే శరణమని. |కంటి|
3 అన్ని సేవలు చేసి సంతృప్తి నొందినే
జోల పాడెద నీకు అయ్యప్పా (2)
అందరిని ఆదుకొని ఆదమరచిన నీకు
ఆనందమున పాడు ఉయ్యాల. (2)
ఉయ్యాలా.... ఉయ్యాలా. (2)