కైకలూరులో వెలసితివే అమ్మా మాయమ్మ,
నీవెంత చక్కని దేవతవే అమ్మా శ్యామలాంబ
1. పండ్లు ఫలమ్ములు, పటిక బెల్లములు
పసుపు కుంకుమలు, మంత్ర పుష్పములు
గుగ్గిలము, సాంబ్రాణి ధూపముల, అగర పరిమళ హారతులెన్నో
2. నిండు పౌర్ణమి వెన్నెలలోన తెల్లని చీరలె తీర్చి ధరించి,
నిండు పౌర్ణమి వెన్నెలలోన ఎర్రని రవికలె ఎంచి ధరించి
ముక్కున ముత్యపు పుడక పెట్టుకుని, వాడవాడలా తిరిగేవమ్మా
3. భక్తుల పాలిట బంగారు తల్లి దీనుల పాలిట దీన బాంధవి
మా పాడిపంటలు చల్లంగ కాచి, పిల్లాపాపల చల్లంగ చూడమ్మా
అమ్మా రావే, శ్యామలాంబ రావే ॥2॥
అమ్మరావే మాయమ్మ రావే అమ్మరావే శ్యామలాంబ రావే ॥2॥
అమ్మా రావే శ్యామలాంబ రావే, అమ్మా రావే మాయమ్మా రావే