ముత్యాల కాంతితో వెలిగేటి మాల,
రత్నాల కాంతితో మెరిసేటి మాల!
కర్పూర జ్యోతిలో కలిసేటి మాల,
కనక మణికంఠుని తులసి మణి మాల!!
||ముత్యాల||
పంబగిరి వాసుని పడగమణి మాల,
పందళ బాలుని పావన మాల!
పంబానది యందు మునిగేటి మాల,
పరితపించే వారు కోరేటి మాల!!
||ముత్యాల|
2 జాతి మత బేధములు తొలగించు మాల,
జగదేకవీరునితో జత కలుపు మాల !
రుద్రయ్య తనయుని రుద్రాక్ష మాల,
శ్రీహరి తనయుని శ్రీ గంధ మాల !! ||ముత్యాల|