పావన రామ నామ సుధారస - శ్రీరామదాసు కీర్తన

P Madhav Kumar

 🙏 శ్రీరామదాసు కీర్తన🙏


పల్లవి:

: పావన రామ నామ సుధారస


పానము జేసేదెన్నటికో


సేవించియు శ్రీహరి పాదంబులు


చిత్తమునుంచే దెన్నటికో  పావన రామ 



చ1: దాసులగని సంతోషమ్మున తవ


దాసోహమ్మను టెన్నటికో


భూ సుతకుసు నతి ప్రాణప్రదంబగు


పురుషోత్తము గనుటెన్నటికో  పావన రామ 



చ2: చంచల గుణములు మాని సదా ని


శ్చలమతి నుండేదెన్నటికో


పంచ తత్వములు తారక నామము


పఠియించుట నా కెన్నటికో  పావన రామ 



చ3: ఇనవంశాంబుధి చంద్రుడు కృప ని


ష్టార్ధము లొసగే దెన్నటికో


కనకచేలు కరుణాలవాలుని


కన్నుల జూచే దెన్నటికో  పావన రామ 



చ4: వంచన లేకను భద్రాదీశుని


వర్ణన చేసేదెన్నటికో


అంచితముగ రామదాసుడ ననుకొని


ఆనందించే దెన్నటికో  పావన రామ🙏

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat