Read in: తెలుగు | ಕನ್ನಡ | தமிழ் | देवनागरी | English | മലയാളം | ગુજરાતી | मराठी |

నిండిన జగములెల్లా నీయాధీనము - తాళ్ళపాక అన్నమాచార్య సంకీర్తన

 ꧁♾️•••••••••┉━❀🕉️❀┉┅••••••••♾️꧂

             🙏 *ఓం నమో వెంకటేశాయ* 🙏

    🌹 *తాళ్ళపాక అన్నమాచార్య సంకీర్తన* 🌹

꧁♾️•••••••••┉━❀🕉️❀┉┅••••••••♾️꧂

అధ్యాత్మ సంకీర్తన.                2752

రేకు: 293-2.                        గానం : నిహాల్

సంపుటము: 3-537

రాగము: శుద్ధవసంత


నిండిన జగములెల్లా నీయాధీనము

బండు జన్మములవాఁడ భయమేమీ నెరఁగ

॥పల్లవి॥


పాతకపు దేహమిది ప్రకృతి యాధీనము

ఆతుమ శ్రీహరి నీయాధీనము

యీతల నాతల నేనెవ్వరి నేమనలేను

చేతనుఁడ నింతే నేను చిక్కిన వేమెఱఁగ

॥నిండి॥


వెలయు నా కర్మము నీ వేదశాస్త్రాధీనము

నిలిచిన జ్ఞానమెల్లా నీయాధీనము

తలఁచి యెవ్వరి నేఁ దగుఁ దగదనలేను

కొలఁది జీవుఁడనింతే కొనమొద లెఱఁగ

॥నిండి॥


అక్కడ నా మనసిక నాచార్యాధీనము

నిక్కపు నామోక్షము నీయాధీనము

యెక్కువ శ్రీవేంకటేశ యెవ్వరి నేమనలేను

పక్కన నీ బంటనింతే పరచింత లెఱఁగ

॥నిండి॥ 

                

꧁♾️•••••••••┉━❀🕉️❀┉┅•••••••••♾️꧂

                ‌ ‌

📢 Follow