జ్ఞానముద్రాం శాస్త్రముద్రాం గురుముద్రాం నమామ్యహమ్ |
వనముద్రాం శుద్ధముద్రాం రుద్రముద్రాం నమామ్యహమ్ || ౧ ||
శాంతముద్రాం సత్యముద్రాం వ్రతముద్రాం నమామ్యహమ్ |
శబర్యాశ్రమసత్యేన ముద్రాం పాతు సదాపి మే || ౨ || [మామ్]
గురుదక్షిణయా పూర్వం తస్యానుగ్రహకారిణే |
శరణాగతముద్రాఖ్యం త్వన్ముద్రాం ధారయామ్యహమ్ || ౩ ||
చిన్ముద్రాం ఖేచరీముద్రాం భద్రముద్రాం నమామ్యహమ్ |
శబర్యాచలముద్రాయై నమస్తుభ్యం నమో నమః || ౪ ||
—
వ్రతమాలా ఉద్యాపన మంత్రం
అపూర్వమచలారోహ దివ్యదర్శనకారణాత్ |
శాస్త్రముద్రాత్మక దేవ దేహి మే వ్రతమోచనమ్ ||
మొదటి సంవత్సరం నుండి 18 సంవత్సరముల వరకు మాల వేసుకున్న స్వాముల పేర్లు.
1వ సంవత్సరం - కన్ని(శరము) స్వామి
2వ సంవత్సరం - కత్తి స్వామి
3వ సంవత్సరం - ఘంట స్వామి
4వ సంవత్సరం - గద స్వామి
5వ సంవత్సరం - విల్లు స్వామి
6వ సంవత్సరం - జ్యోతి స్వామి
7వ సంవత్సరం - సూర్య స్వామి
8వ సంవత్సరం - చంద్ర స్వామి
9వ సంవత్సరం - వేలు(త్రిశూల) స్వామి
10వ సంవత్సరం - విష్ణు చక్ర స్వామి
11వ సంవత్సరం - శంఖం స్వామి
12వ సంవత్సరం - నాగాభరణం స్వామి
13వ సంవత్సరం - శ్రీ హరి స్వామి
14వ సంవత్సరం పద్మ స్వామి
15వ సంవత్సరం - శ్రీ (త్రిశూల) స్వామి
16వ సంవత్సరం - శబరిగిరి స్వామి
17వ సంవత్సరం - ఓంకార స్వామి
18వ సంవత్సరం - నారికేళ స్వామి