🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️
*శాస్తాంకోట్టై అయ్యప్పస్వామివారి ఆలయం - 1*
☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️
శాస్తాంకోట్టై అను పేరు వినగానే తొలుత మనసులో గోచరించునది నీటిమద్యన దీపగర్భములా వానర సైన్యము మద్యలో యుండు అతి పెద్దదైన శ్రీ ధర్మశాస్తా (అయ్యప్ప) ఆలయమగును. ఈ ఆలయము కేరళలోని కొల్లం - ఆలప్పుళ రహదారిలో కరునాగప్పళ్ళి నుండి భరణక్కావు దారిలో ఈ శాస్తాంకోట్టై జంక్షన్ కలదు. ఇచ్చట నుండి 11 కి.మీ. దూరములో ఈ దివ్యమైన శ్రీ శాస్తా వారి క్షేత్రము కలదు. ఇచ్చట శ్రీ స్వామి వారు ప్రభాదేవి మరియు సత్యకన్ అను పుత్రునితో సహా కొలువు తీరి యున్నారు. ఈ క్షేత్రమున 12 దినములు బసచేసి పూజలు ఆరాధనలు జరిపినచో తీరని కర్మవ్యాధులు కూడా తీరు తుందన్నది ఇచ్చటి ఐతిహ్యము. తూర్పు ముఖము గా స్వయంభు అయిన శ్రీ ధర్మశాస్తా వారి ప్రతిష్ట. ప్రభ యను పత్నితోను సత్యకుడగు పుత్రునితోను కలసి గృహస్తునిగా శ్రీస్వామివారు ఇచ్చట దర్శన మొసంగు చున్నారు. గర్భాలయము చుట్టూ యుండు గోడలకు రాతిలో చెక్కబడిన అనేక చిత్రములు గలదు ముఖమండపమున శ్రీరామాయణ కథను రాతిలో చెక్కించియున్నారు. మెట్లవద్దను , చేతులు పట్టుకొనే ప్రదేశమునందుకూడా మనోహరమైన శిల్పములు చెక్కించియున్నారు. ఈ శాస్తాంకోట్టై క్షేత్రమున 12 దినములు నివసించి ఆరాధనలు జరుపువారికి దేహసంబంధమైన సర్వవిధములైన రోగములు సమసిపోతుందన్నది ప్రతీతి. శ్రీస్వామివారిని పిలిచి ప్రార్ధించినచో వల్లకాని పనికూడా అనుకూలమౌతున్నది ఇచ్చటి విశిష్టత. శ్రీ స్వామివారికి విశేష ప్రసాదముగా *"అడ"* పెడుతున్నారు. శనిదోష నివారకుడుగా కూడా ఈ స్వామిని సంకల్పించి ఆరాధించెదరు. బుధ , శనివారములలో దీపారాధన ఇచ్చట ప్రాధాన్యత సంతరించుకొనుచున్నది. విశేష మరియు పర్వదినములలో ఇచ్చట మరింత సమయము ఆలయం తెరచియుండును. అన్నప్రాశనం ఇచ్చట మరొక్క విశిష్ట ఆరాధనగా సల్పబడుచున్నది. శ్రీ స్వామివారి బిడ్డలని చెప్పబడు ఈ ఆలయ సమీపములోని సెలయేరులోని చేపలకు బొరుగులు , బియ్యము విసిరి ఆరాధించుటను గూడా ఇచ్చట *"అరియూట్టు"* యను విశేషఆరాధనగా సల్పుదురు. ఈ ఆలయంలో వానరములకు విశిష్టమైన మర్యాదలు లభించుట సూచనీయం. ఇవి అచ్చటికి వచ్చు భక్తులను ఏమాత్రము హింసించవు. ఈ కోతులకు పండ్లు చెనక్కాయలు విగరాలు ఇచ్చి భక్తులు శ్రీరామదూత హనుమంతుని ఆరాధించినట్లు భావింతురు. ఈ ఆలయ ప్రాంగణమున గణపతి , శివుడు , నాగరాజ , బ్రహ్మరక్షస్ , ఋషీశ్వరులు , భూతనాథుడు , మాడన్ మున్నగు ఉపదేవతల ప్రతిష్ఠలు డిసెంబర్ మాసమున ఉత్తరానక్షత్ర ఆరాట్టు ఉత్సవముతో ముగిసే 10 దినముల ఉత్సవము ఇచ్చట మిక్కిలి ప్రాధాన్యత సంతరించుకొన్నదగును. ఇక మండల , మకర విళక్కు , దినములు , మహాశివరాత్రి , పంగుణి ఉత్తరం మొదలగు దినములందు కూడా విశేష పూజలు జరిపించబడును. ఈ ఆలయము గూర్చి యొక విశేషమైన కథ యొకటి ఇచ్చటి వారు చెప్పుకొందురు. ఇక్కడ నెలకొనియుండు శ్రీ స్వామివారి విశిష్టతకు ఇది యొక తార్కాణమగును.
*(సశేషం)*
*ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప*
*శ్రీ ధర్మశాస్తావే శరణం అయ్యప్ప*
*శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణువే*
*అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకనే శరణం అయ్యప్ప*
*లోకాః సమస్తా సుఖినోభవంతు*