శ్రీ మహాశాస్తా చరితము - 33 వేదనాయకుని సాక్షాత్కారము

P Madhav Kumar


*వేదనాయకుని సాక్షాత్కారము*

☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️

*అఖిల భారత అయ్యప్ప దీక్షా ప్రచార సమితి  (ABADPS)*

ఎంతో కాలముగా చేస్తున్న విప్రుల ఆక్రందనలు , వారి ప్రార్ధనలు వీటితో పాటుగా విభుని యొక్క ప్రార్థనలు ఆలకించిన మహాశాస్తా తన లీలను కొనసాగించ ఉద్యక్తుడాయెను. యజ్ఞమూర్తియైన
మహాశాస్తా , మహాగంభీరుడై , *ఒక మేకపై* అధిరోహించి , ఆరు కరములతో తేజోమయునిగా
ఆవిర్భవించెను.

ఎడమవేపున దండకము , ధ్వజము , కత్తితోనూ , కుడివేపున గంట , కపాలము , డోలు ధరించి
మేకపై అధిరోహించిన మహాశాస్తా , మహాకేతువు పైకి తన దండాయుధమును ప్రయోగించెను. ఆ
దండాయుధము అతి వేగవంతముగా సంచరిస్తూ మహాకేతువుని , అతడి సైన్యమును సంహరించి ,
తిరిగి స్వామి కరములకు అలంకరించినది.

ఎంతోకాలముగా తాము చేయు ప్రార్థనలు ఫలించి , వేదరక్షణకై , ఉద్భవించిన శ్రీ మహా శాస్త్రాని విభు చక్రవర్తియూ , మిగతా విప్ర పరివారము పలు తెరగులు స్తుతించిరి.



*ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప*

*శ్రీ ధర్మశాస్తావే శరణం అయ్యప్ప*

*శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణువే*

*అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకనే శరణం అయ్యప్ప*

*లోకాః సమస్తా సుఖినోభవంతు*


#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat