శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం
ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోప శాంతయే
*||శుక్లాంబరధరం॥*
*చరణం - 1*
పాహి పాహి పార్వతినందన ప్రణవస్వరూపావేగమెరారా ||కో||
మొదటిపూజ నీకే చేతుము స్వీకరించరా గణపతిదేవా ||కో||
కుడుములు ఉండ్రాళ్ళనూ - హే - హే
ఆరగించరావాలయ్యా - స్వామీ
వడపప్పూ పానకాలనూ - హే - హే
స్వీకరించరావాలయ్యా - తండ్రీ
అడవిలోని పత్రి తెచ్చి పూజలు చేసేమయ్యా
ఆదరించి ఆదుకోర బుజ్జీ గణపయ్యా
గణపతి పప్పా - మోరియా
ఓ బొజ్జగణపయ్యా - వినాయక
నీ బంటు నేనయ్యా - వినాయక
విఘ్నముతొలగించి - వినాయక
విజయమునందించు - వినాయక
॥శుక్లాంబరధరం||
చరణం 2 :
సిద్ధిబుద్దీ రూపమునీవే - సిరులనొసగే శ్రీ గణనాధా ||||
విజయమొసగే విఘ్నవినాయక - కంటిరెప్పైకాపాడయ్యా |||||
చిట్టిఎలుకమీదఎక్కి - హై - హై
లోకాలూ తిరిగేవయ్యా - స్వామీ
చిరునవ్వు లొలకబోయుతూ - హై - హై
అభయమిచ్చి రక్షించయ్యా - తండ్రీ
భక్తులనూ కాపాడే బంగారూదేవుడా ||||
కాణిపాకం దేవా కరుణించరావ
గణపతి పప్పా - మోరియా
శ్రీకర శుభకరుడా - వినాయక
శ్రీ లక్ష్మి గణనాధా - వినాయక
కాణిపాకదేవా - వినాయక
కాపాడగరావా - వినాయక
*||పల్లవి మొత్తం||*
శరణం శరణం - గణేశ శరణం
విఘ్నరాజ శరణం - గణేశశరణం
దండాలయ్యా - ఉండ్రాళ్ళయ్యా
అండా దండా ఉండాలయ్యా
మూషికవాహన - వినాయకా
మోదుకహస్తా – వినాయకా
అయ్యప్పసోదర - వినాయకా
ఆర్ముగ సోదర - వినాయకా
గౌరీనందన - వినాయకా
గిరిజానందన - వినాయకా
పార్వతినందన - వినాయకా
పాదనమస్తే - వినాయకా
కాణిపాకదేవా - వినాయకా
కరుణించయ్యా - వినాయకా
కన్నిమూలగణపతి - వినాయకా
కాపాడయ్యా - వినాయకా
శరణం శరణం - గణేశ శరణం
విఘ్నరాజ శరణం - గణేశ శరణం
జై బోలో గణేష్ మహరాజ్ కి
కాణిపాక వరసిద్ధి వినాయకునకు
కన్నిమూల గణపతి భగవనే శరణం అయ్యప్ప
ఈ పాటను ఎలా పాడాలి ఇక్కడ టచ్ చేసి చూడండి.