శ్రీ మహాశాస్తా చరితము - 40 మకుటాసుర వధ

P Madhav Kumar

*మకుటాసుర వధ*

☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️

*అఖిల భారత అయ్యప్ప దీక్షా ప్రచార సమితి  (ABADPS)*


తన సేనాధిపతి , సైన్యము భస్మీపటలమైన సంగతి విన్న మకుటాసురుడు ఉగ్రమూర్తియైనాడు.
వేయి సింహములు పూర్చబడిన రథమునెక్కి బాలశాస్తా ఉండు స్థలమునకు ఏతెంచినాడు. శాస్తా
ఈ విషయమును ముందే ఎరిగినవాడై , అతడిని ఎదుర్కొనెను. మకుటాసురుని కన్నులు నిప్పువలె సెగలు కక్కసాగెను.

*"అర్భకుడా ! నా కుడి భుజము , అసుర కులమునకు హృదయము వంటి వాడైన కంబళాసురుని మాయోపాయము చేత సంహరించినావు. నిన్ను చంపియే తీరుదును”* అంటూ రంకెలు వేయుచూ , బాణ వర్షము కురిపించసాగెను. సముద్రమును చేరు వర్షము చినుకులవలె , అవన్నియూ స్వామి
శరీరము తాకినంతనే అదృశ్యమై పోవుచుండినవి.

దిగ్ర్భాంతిచెంది , అయోమయముగా నిలుచున్న మకుటాసురుని ముందు అద్భుత రూపముతో
స్వామి ప్రత్యక్షమాయెను. నవరత్న ప్రభలు మేనియందు మెరయుచుండగా , సుందర రూపము బూని , చంద్రవంక అలంకరింపబడిన కిరీటమును ధరించి , ఆరు కరములయందు బాణము , శూలము , డోలు , కపాలము , విల్లు , డమరుకమును ధరించి మదపుటేనుగును అధిరోహించియుండెను.

అసురుని వంక చూసి *“మూర్ఖుడా ! అందరివలె నేను సాధారణ బ్రాహ్మణ బాలుడను గాను. నిన్ను సంహరించు నిమిత్తమై అవతరించిన ఆది మూలమును నేను. నా అవతార వైశిష్ట్యము లోకమునకు తెలియు సమయము ఆసన్నమైనది.”* అంటూ తన చేతిలోని శూలమును రాక్షసుని పైకి
విసరెను. అది మెరపువలె జ్వలించుచూ మకుటాసురుని హృదయమును చీల్చివైచెను. రాక్షసుడు
మరణించెను.

దేవతలు , సిద్ధులు , స్వామి ముందు గుమిగూడి పలు పలు విధముల స్తుతించిరి. వారిని స్వామి ఆశీర్వదించి , తనను పెంచి పెద్ద చేసిన పుణ్యకీర్తి , జ్ఞానసుందరి దంపతులకు ముక్తి మార్గమును చూపెను.



*ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప*

*శ్రీ ధర్మశాస్తావే శరణం అయ్యప్ప*

*శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణువే*

*అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకనే శరణం అయ్యప్ప*

*లోకాః సమస్తా సుఖినోభవంతు*


#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat