*కాలుని దండించిన శాస్తా*
☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️*అఖిల భారత అయ్యప్ప దీక్షా ప్రచార సమితి (ABADPS)*
కొంత కాలమునకు తరువాత యమధర్మరాజు యొక్క పనులను పర్యవేక్షించు నిమిత్తము
*'కాలుడు'* అను మంత్రి నియమించబడెను. ఒకమారు పాపుడు ఒకడు మరణసమయమున.
అనాలోచితముగా స్వామి యొక్క నామమును ఉచ్చరించుటచే అతడి పాపములన్నియూ తొలగిపోయి
పుణ్యాత్ముడాయెను.
ఇంతకు ముందు జరిగిన వృత్తాంతము ఏదియూ తెలియని కాలుడు అతడిని కొనిపోవుటకై తన భటులతో అచటికి పోయి , బలవంతముగా ఆపావుని కొనిపోవ శతవిధముగా యత్నించసాగెను.
ఇదంతయూ తెలిసికొన్న స్వామి యొక్క ప్రధాన గణాధిపతి అయిన మహా కాలుడు శివగణములను
అతడి పైకి పంపి, యమదూతలను తరిమివేసి, కాలుని బట్టి పాతాళ గుహలో బంధించి వైచెను.
సంగతి విన్న యముడు నంది దేవుడు వద్దకు పరుగెత్తిపోయి తన మంత్రిని చెరవిడిపించి
పంపుమని అడుగగా , నందీశ్వరుడు బదులుగా *“అది నాకు సాధ్యము కాని పని. కాలుని చెరబట్టి బంధించినది మహాకాలుడైన శాస్తా. యొక్క సేనాధిపతి. మీరు అతడి వద్దకుపోయి, మన్నింపుమని ప్రార్థించి , కాలుని విడిపించుకుపొమ్ము”* అని చెప్పెను.
వెంటనే పరుగెత్తిపోయి మహాకాలుని పాదములపై బడి కాలుని విడిపింపుమని ప్రార్థించెను. అందులకు కోపముగా మహాకాలుడు యమధర్మరాజుతో *“మునుపు జరిగిన వృత్తాంతమును మరచిపోతివా ? అంటూ హెచ్చరించి ఒక గణమును పంపి కాలుని విడిపించెను. అందులకు కాలుడు , యుమధర్మరాజు లిరువురు మహాకాలునికి నమస్కరించి వెడలిపోయిరి.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
*శృణుషవై గమనా భూత్వా పునర్ వాక్యం మమాతునా*
*జపంతియే మహాదేవ్యా దివ్యనామాని సంతతం*
*విఘ్నేస్వరస్య నామాని స్కందస్యచ మహాత్మనః*
*భైరవస్య సనామాని వీరభద్రస్య తాన్యపి*
*మహాశాస్తుశ్చ నామాని నందీచస్య గణాగ్రణే:*
*మహాకాళాది నామాని తదై వాస్త్రాయుధశ్యచ*
*వృషభస్య సనామాని భక్తానాం శంకరస్యచ*
*జపంతితే మహాత్మనో విప్రత్యభి నిరంతరం*
*నధాన్య ప్రత్యతి కారోనః పాపః పుష్టి వివర్జితాన్*
*దృష్ట్యాతాన్ దూరతో భీత్యా గచ్ఛామి శివ వల్లభాన్*
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
భీతి నుండి ఇంకనూ తెప్పరిల్లలేని స్థితిలో ఉన్న కాలుడు యమధర్మరాజా ! తెలియక నేను చేసిన
నేరమునకు ఇంత దుస్థితి కలిగినది. మీరు రాకపోయినచో నేను తప్పక బలి గావింపబడి యుందును. *“అని భోరుమనెను. దానికి యమధర్మరాజు” కాలుడా ! శివగణములను ఎప్పుడైతే చూచితిరో , ఆ క్షణమే నీవు బయలుదేరి వచ్చి యుండవలసినది. మరొకమాట జాగ్రత్తగా వినుము - పార్వతి దేవి , విఘ్నేశ్వరుడు , స్కందుడు భైరవుడు , వీరభద్రుడు , మహాశాస్తా , గణాధిపతియైన నందికేశ్వరుడు , మహాకాలుడు , వృషభరాజు , శివభక్తులు ఇలా వీరిని ఎవరైతే జపించుదురో వారిని ఎవరూ ఏమి చేయజాలరు నేనే వీరి జోలికి పోను వారికి దూరముగానే ఉందును. '* అని చెప్పెను.
*ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప*
*శ్రీ ధర్మశాస్తావే శరణం అయ్యప్ప*
*శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణువే*
*అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకనే శరణం అయ్యప్ప*
*లోకాః సమస్తా సుఖినోభవంతు*