ఘల్లు ఘల్లున రావయ్య గణనాథ
నీకు ఘనమైన పూజలు గణనాథ ||కోరస్||
ఘల్లు ఘల్లున రావయ్య గణనాథ
నీకు ఘనమైన పూజలు గణనాథ
పార్వతి తనయా పాలించరావ నిన్నే వేడితి లాలించరా...
॥ఘల్లు ఘల్లు||
మూషిక వాహన మోదక హస్తా శ్రీ గణనాథ నీవేనయ్య
మూషిక వాహన మోదక హస్తా న ||కోరస్||
శ్రీ గణనాథ నీవేనయ్య వ్రతమేదైన - పూజేదైన వ్రతమేదైన - పూజేదైన ముందుగా నిన్నే కొలిచేమయ్య
||ఘల్లు ఘల్లు||
మంగళ మూర్తివి ఓ గణనాథ మా మదిలోన నీవేనయ్య
మంగళ మూర్తివి ఓ గణనాథ మా మది నిండా నీవేనయ్య
పగలేనైన రేయేనైన - పగలేనైన రేయేనైన నీ నామమునే పలికేమయ్య
||ఘల్లు ఘల్లున||
ముల్లోకాలలో నీవేనయ్య మొదటి పూజలు నీకేనయ్య ||కోరస్||
ముల్లోకాలలో నీవేనయ్య
మొదటి పూజలు నీకేనయ్య
లాభము శుభము కీర్తిని పంచే - లాభము శుభము కీర్తిని పంచే
లక్ష్మీ గణపతి నీవేనయ్య
||ఘల్లు ఘల్లున||
పార్వతీ తనయా - పాలించ రావా
నిన్నే వేడితి లాలించరా ||ఘల్లు ఘల్లున||
*స్వామియే శరణం అయ్యప్ప*
*లిరిక్స్ పంపిన వారు :
*వై. వెంకటసుబ్బారెడ్డి స్వామి*
*కడప*