Lord ganesha: వినాయకుడి ప్రతి విగ్రహానికి ప్రత్యేక అర్థం, ఏ విగ్రహం దేనికి సంకేతమో తెలుసుకోండి

P Madhav Kumar


Lord ganesha: గణేశ భక్తులు తమ ఇంటిలో ఉంచడానికి వినాయక విగ్రహాన్ని కొనుగోలు చేయడానికి మార్కెట్‌కి వెళ్లాలని ఆలోచిస్తున్నారా? అయితే వినాయకుడి విగ్రహానికి తొండం ఏ వైపు ఉన్నది కొనాలి? ఏ గణపతి విగ్రహానికి ప్రత్యేక అర్ధం ఏమిటో తెలుసా?

వినాయకుడి తొండం ఏ వైపు ఉండాలి?
వినాయకుడి తొండం ఏ వైపు ఉండాలి?

Lord ganesha: ఏదైనా శుభ కార్యం చేసే ముందు దాని ఆహ్వానాన్ని ముందుగా గణేశుడికి అందజేస్తారు. ఇలా చేయడం వల్ల మనిషికి ఎలాంటి ఆటంకాలు లేకుండా అన్ని పనులు పూర్తవుతాయని నమ్మకం. 

చాలా మంది పండుగ రోజు మట్టి వినాయకుడిని ఇంటికి తీసుకొచ్చి ప్రతిష్టించుకుని పూజలు జరిపిస్తారు. మరికొందరు పెద్ద విగ్రహాలను కొనుగోలు చేస్తారు. మీరు వినాయకుడి విగ్రహాన్ని కొనుగోలు చేయడానికి వెళ్తున్నారా? అయితే వినాయకుడి తొండం ఏ వైపు ఉన్నది తీసుకుంటే ఎటువంటి ఫలితాలు ఇస్తాడో తెలుసుకోండి. వినాయక చవితి సందర్భంగా మార్కెట్లో విభిన్న రకాల వినాయకుడి విగ్రహాలు దర్శనమిస్తాయి. ఒక్కో దానికి ఒక్కో అర్థం ఉంటుంది. వాటి ప్రకారం మీరు అనుకున్న విధంగా విగ్రహం కొనుగోలు చేసుకోవచ్చు. ఎటువంటి విగ్రహం ప్రతిష్ఠించుకుంటే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో తెలుసుకుందాం. 

పంచముఖి గణేష్

పంచముఖి వినాయకుడి ప్రతిమను ఎక్కువగా మండపాల్లో ఏర్పాటు చేస్తారు. గణేష్ చతుర్థి నాడు పంచముఖి గణేశుడిని పూజించడం ద్వారా ఎటువంటి ఆటంకాలు లేకుండా జ్ఞాన ప్రాప్తి కలుగుతుందని నమ్ముతారు. 

ఏనుగుపై వినాయకుడు 

ఎలుక బొజ్జ గణపయ్య వాహనం అని అందరికీ తెలిసిందే. మార్కెట్ కి వెళ్ళినప్పుడు మీరు ఏనుగు మీద వినాయకుడు కూర్చున్న భంగిమలో ఉన్న విగ్రహం ఎంచుకుంటే మంచిది. ఏనుగుపై కూర్చున్న గణపతి ఒక వ్యక్తికి సంపద, కీర్తి, గౌరవాన్ని ప్రసాదిస్తాడు. 

ఆకుపచ్చ రంగు వినాయకుడు 

వినాయక చవితి వేడుకల్లో విగ్రహాలు అనేక రంగుల్లో దర్శనం ఇస్తూ ఉంటాయి. మీరు ఆకుపచ్చ రంగు గణపతిని ఇంటికి తీసుకురండి. ఈ రంగు వివేకం, తెలివి, జ్ఞానంతో ముడిపడి ఉంటుంది. గణేష్ చతుర్థి నాడు ముఖ్యంగా చదువుకునే పిల్లలు ఆకుపచ్చ రంగులో ఉన్న వినాయకుడిని పూజించాలి. ఇలా చేయడం వల్ల వారి ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెరుగుతుంది. విద్యలో చక్కగా రాణిస్తారు. 

వేణువు వాయిస్తున్న వినాయకుడు 

గృహ సమస్యల నుండి శాంతిని పొందడానికి ఇంట్లో వేణువు వాయిస్తున్నట్టుగా ఉన్న వినాయకుని విగ్రహాన్ని ప్రతిష్టించి పూజించాలి. ఇలా చేయడం వల్ల కుటుంబంలో ఆనందం, శాంతి నెలకొంటాయి.

ఎడమ వైపు తొండం ఉంటే 

గణేశుడి తొండం ఎడమ చేతి వైపు ఉండాలి. అలాంటి విగ్రహం ఇంట్లో సానుకూలతను కలిగి ఉంటుందని చెబుతారు. అలాగే జీవితంలో ఆనందం, శ్రేయస్సును తెస్తుందని నమ్ముతారు.

తొండం నిటారుగా ఉంటే 

మీరు తొండం వంపు తిరిగి కాకుండా నేరుగా ఉన్న వినాయకుడి విగ్రహాన్ని కూడా ప్రతిష్టించవచ్చు. అలాంటి విగ్రహం ఏర్పాటు చేయడం వల్ల ఇంటి వాతావరణం ఆహ్లాదకరంగా ఉండి శాంతి, సంతోషాలు వెల్లివిరుస్తాయి.

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat