Lord ganesha: గణపతికి ప్రీతికరమైన పువ్వులు ఇవే, ఈ వినాయక చవితికి వీటితో పూజ చేయండి

P Madhav Kumar


Lord ganesha:  వినాయక చవితి పండుగ పండుగకు గణపతికి ఎంతో ప్రీతికరమైన పువ్వులతో పూజ చేయడం వల్ల మీ మనసులోని కోరికలు నెరవేరతాయని అభీష్టాలు సిద్ధిస్తాయి.

వినాయకుడికి ఇష్టమైన పువ్వులు ఇవే
వినాయకుడికి ఇష్టమైన పువ్వులు ఇవే (pixabay)

శ్లో॥ వక్రతుండ మహాకాయ కోటిసూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమేదేవా సర్వకార్యేషు సర్వదా॥

ఏ పూజకైనా తొలిగా పూజను అందుకునేది వినాయకుడే పూజకు కలిగే సకల ఆటంకాలను తొలగించమని ఆ గణనాథుడిని పూజించవలసిందే. గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైన పుష్పం తామర. తెల్లతామర పుష్పములతో గణపతిని పూజిస్తే సకల కార్యాలందు ఉన్న విఘ్నములన్నీ తొలగిపోతాయి.

తెల్లజిల్లేడు, చామంతి, శంఖపుష్పము, తెల్ల, ఎర్ర, పసుపు గన్నేరు పుష్పములు, బొండుమల్లి పుష్పములతో కూడా వినాయకుడిని పూజించవచ్చు. ఇక శివునికి ప్రీతిపాత్రమైన అన్ని పుష్పాలతో గణపతిని పూజించవచ్చని చెప్తారు. శివగణాలలో ఒకడైనందున ఈ విధంగా చెప్తారని పండితవాదం. వినాయకుడిని ఏ పుష్పంతో అయినా పూజించవచ్చని కూడా అంటారని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

గణపతి మూర్తులలో కలువ, తామర పువ్వులను ధరించిన మూర్తులను పురాణాలు పేర్కొంటున్నాయి. ముద్దుల పురాణానుసారం గణపతికి తామర, కలువ, ఎర్రనివి, తెల్లనివి ప్రీతికరమైనవిగా వివరణ కన్పిస్తుంది.

గణపతి పూజలో తులసీపత్రం నిషిద్ధం అన్నట్లుగా పుష్ప పూజకంటే గరికతో పూజిస్తేనే స్వాతి అతి త్వరగా కరుణిస్తాడని ప్రతీతి అని బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

ఎర్ర గన్నేరు కూడా వినాయకుడికి ప్రీతికరమైనదే. వినాయకుడి ఆలయంలో ఈ చెట్టు ఉన్నట్లయితే దానికి నమస్కరించుకోవడం ఎంతో శుభం కల్గిస్తుంది 

HT Telugu ఫేస్‌బుక్ పేజీ ద్వారా అప్‌డేట్స్ పొందండి

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat