రఘురామ నీ నామం - మకరందము కన్నా మధురం
శ్రీ రామా నీ రూపం - ఆ నింగిలో ఉన్నా దీపం
నీల మేఘ శ్యామా కోదండ రామా
నీలి గగనాలు కన్నా మిన్నైన ప్రేమా
జఘదభి రామా జానకి రామా
అందరి బంధువు అభి రామా
సాకేత రామా సద్గుణాల శ్యామా
సంపత్తులొద్దు రామా - సౌజన్యమీయూ రామా
సకృత రామా ప్రసన్నమైనా
సంపద లెందుకు సీతా రామా
అనురాగ దేవుడా - అభి నవ రాముడా
అతి బలవంతుడైన - అంజి హృదయ వాసుడా
కానగ రావా కౌసల్య రామా
కారుణ్య దాయక - జాలము చేయక
రామ చంద్ర రాజూ - స్మరణ చేసే రోజూ
కానుకగా కవితలు వ్రాసి - కమలాకర భజనలు చేసి
వి వి రెడ్డి - కృష్ణం రాజు
పద సేవకులై పాటలు పాడుతూ