నాగుల చవితి ఓ నాగన్నా - మా పూజలను గైకొనుమన్నా - నాగరాజ భజన పాటల లిరిక్స్

P Madhav Kumar


పల్లవి : 

నాగుల చవితి ఓ నాగన్నా - మా పూజలను గైకొనుమన్నా
కోటి కోటి దండాలు స్వామి నాగన్నా
మము చల్లగా కాపాడుమయా స్వామి నాగన్నా   

|| కోటి ||


శ్రీహరి పానుపు నీవేనయ్యా - శివయ్య మెడలో భూషణమయ్యా
నీ పూజలను ఘనముగ చేతుము దిగిదిగి రావయ్య నాగన్నా   

|| కోటి ||


పిల్లా పాపల తోడనుమేము- నీ పుట్టకును వచ్చితిమయ్యా
భక్తితో నిన్ను మ్రొక్కెదమయ్యా కోరిన కోర్కెలు తీర్చగ రావా   

|| కోటి ||

గుమ్మడి తంగేడు పూలను తెచ్చి- చలిమిడి చిమ్మిలి నైవేద్యమిచ్చి
పాలు గుడ్లు నీ కర్పించి ముదముగ నిన్ను కొలిచెదమయ్యా     

|| కోటి ||

పొలాల గట్లను తిరిగే రైతుల మేతకు వచ్చే మూగ జీవులను
కాటు వేయక కరుణను చూపి కాపాడుమయా నాగన్నా  

|| కోటి ||

కోపము బూనకు కోడెనాగన్నా దయగల తండ్రివి నీవేనన్నా
నాగుల చవితి మా నాగన్నా అప్పన్న దాసుని మొర వినుమన్నా  

|| కోటి ||

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat