నమో నాగరాజా - నమో దివ్య తేజా
నమో ఆదిశేషా - భక్త పోషా
పాలకడలి నందున స్వామి విష్ణుమూర్తి పానుపు నీవే
కైలాసవాసుని మెడలో నిరతమును భూషయు నీవే
నాగలోక రారాజువులే ఇలను పూజలను అందగరావే
మొగలిపొదల మాటున దాగి మురిసి నాట్యమాడెదవయ్యా
పైరగాలి పరవళ్లకును పరవశించిపోయెదవయ్యా
నీ నాట్య భంగిమలకును ఈ జగమే పులకించెగదయ్యా
నాగరాజు నీ పుట్టకును పిల్లా పాపలతో చేరి
నీ పుట్టలో పాలును పోసి నీపూజలు చేతుము దేవా
చల్లంగా మము దీవించి ఎల్లవేళలా కావగ రావా
రకరకాల పూలను తెచ్చి నీ పుట్టను అలంకరింతుము
చలిమిడి వడపప్పు చిమ్మిలి నైవేద్యము నీ కర్పింతుము
కరుణ చూపి ఓ నాగేంద్రా అప్పన్న దాసుని దండము గొనుమా