హంసధ్వని రాగం : ఖండ గతి తాళం
శ్లోకం : ఓం...హరహర మహాదేవ శంభో...
నందీశ్వర ప్రమదనాధ మహేశ్వరా..
కామేశ్వరీప్రియ మహనందీశ్వరా
నమో...నమః...ఆ...ఆ...ఆ...ఆ...
పల్లవి : మహనందీశ్వర మముగన్న తండ్రి
మా యింటి దైవమా ముక్కంటి దేవ
బ్రోవర...కావర...భోళా..శంకరా
జై జై నందీశ్వరా...జై జై పరమేశ్వరా
సనిసనిప నిపనిపగ పగపగరి గరిస
గరిసస పగరిరి నిపగగ గపనిసా పనిసా పానిరిగరిసా
చరణం: నీవున్న మహానంది మా పుణ్యధామం
సస్యశ్యామలమై ప్రవహించు ఝరులు
గిరులు ఝరులు విరులు హరుని
ప్రతిరూపములు ఓం... నందీశ్వరా.... ౹౹మ౹౹
సాసాస నినిసాస నిసాస గరిసా గపగరి
నినిరిస గరిసనిప రిసనిపగ సనిపగరి
పగరిస సరిగాగ సరిగపా గపనీని గరిసా
గరిసనిప నినిరిస నినిససస నినిరిరిరి
నినిససస నినిరిరిరి గరిగరిస గపనిస పనిస
పానీరిగరిస సససస గగగగ పపపప నినినినిరి గరిస
చరణం: తదిమి తకదిమి దిమిదిమి తైతై
నాట్యమాడే నందీశుడు వేదవేదమ్ములు
వెలుగెత్తి వల్లించె నల్లమల శైలంబులు
భూలోకమందున ముక్తిదాయకమై అలరారె
ఆ క్షేత్రమూ మహానందీశ్వరుని దర్శనంబే
ఫలదాయకము సర్వఫలదాయకం. ౹౹మ౹౹