కరుణారస భరణా - ఘనాఘనా - భజన పాటల లిరిక్స్

P Madhav Kumar


రాగం                          :- మాల్కోస్ రాగం
తాళం                         :- ఆది తాళం

సాకి    :- కరుణారస భరణా - ఘనాఘనా
              సుజన జనావన - సుందర వదనా- 3

పల్లవి  :- కరుణారస భరణా - ఘనాఘనా
              సుజన జనావన - సుందర వదనా.

చరణం:- సరసిజదళ నయనక్షిరాబ్దిశయనా
              సురగణమునిజన - వందిత చరణా
              నానాజీవన నాటక కారణ
              నతజన పాలన - శౌరిమురారి పాప విదారి.

చరణం:- యుగ యుగమున నీ జగమొనరించి
              అగణిత మహితో - అవనిజనించి
              నిగమ యాగముల - నియతి రక్షించి
              పగతులు గూల్చిన - శౌరిమురారీ పాప విదారీ.

Tags

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat