నిను బాసి ఎటులనుందురా
ఓ కన్నతండ్రి కలుషహరణా భువనభరణా రాధారమణా
గొల్లవేషధారివట యుల్లమున ఎల్లప్పుడు
చల్లగాను నిండిన వ్రేపల్లెటూరి నల్లని స్వామి
నీదు మాయ తెలియలేక నిన్ను గొల్లబాలుడనిరి
క్రమముగా నరకుని చంపి కంసుని మదమణచలేదా
ఆవలమంద మేపగా ఆనంద రంగడనిరి
కాళింది మడుగులోన తాండవమాడిన తాండవకృష్ణా
కురుక్షేత్ర యుద్ధమందు అర్జునుడు సందేహింప
సంశయములు తీర్చి నీవు విశ్వరూపము చూపలేదా
ఆవల బాలుడనవే ఓయమ్మ నన్ను అయోధ్యరాముడనవే
ఆవల బాలుడనెద నా చిన్నికృష్ణా అయోధ్యరాముడనెదా
కొండెజుట్టి పూలుబెట్టవే ఓయమ్మ నన్ను కోదండరాముడనవే
కొండెజుట్టి పూలుబెట్టెద నా చిన్నికృష్ణా కోదండరాముడనెదా
మల్లెపూల హారమేయవే ఓయమ్మ నన్ను మత్స్యావతారుడనవే
మల్లెపూల హారమేసెద నా చిన్నికృష్ణా మత్స్యావతారుడనెదా
రవ్వల గొలుసులేయ్యవే ఓయమ్మ నన్ను రాధా రమణుడనవే
రవ్వల గొలుసులేసేదా నా చిన్నీ కృష్ణా రాధా రమణుడనేదా