మల్లెపూల హారమేయవే ఓయమ్మ నన్ను మత్స్యావతారడనవే
మల్లెపూల హారమేసెదా ఓరయ్య నిన్ను మత్స్యావతారడనేదా
కుప్పి కుచ్చుల జడలు వేయవే ఓయమ్మ నన్ను కూర్మావతారడనవే
కుప్పి కుచ్చుల జడలు వేసెదా ఓరయ్య నిన్ను కూర్మావతారడనేదా
వరములిచ్చి దీవించవే ఓయమ్మ నన్ను వరాహావతారుడనవే
వరములిచ్చి దీవించెదా ఓరయ్య నిన్ను వరాహవతారుడనేదా
నాణ్యమైన నగలు పెట్టవే ఓయమ్మ నన్ను నరసింహావతారుడనవే
నాణ్యమైన నగలు పెట్టెదా ఓరయ్య నిన్ను నరసింహావతారుడనేదా
వరములిచ్చి దీవించవే ఓయమ్మ నన్ను వామనావతారడనవే
వరములిచ్చి దీవించెదా ఓరయ్య నిన్ను వామనావతారుడనేదా
పరశువు నాకియ్యవే ఓయమ్మ నన్ను పరశురామావతారుడనవే
పరశువు నీకిచ్చేదా ఓరయ్య నిన్ను పరశురామావతారుడనేదా
రాజ్యమిచ్చి దీవించవే ఓయమ్మ నన్ను రామావతారుడనవే
రాజ్యమిచ్చి దీవించెద ఓరయ్య నిన్ను రామవతారుడనేదా
శిరమున పింఛం పెట్టవే ఓయమ్మ నన్ను కృష్ణవతారుడనవే
శిరమున పింఛం పెట్టేదా ఓరయ్య నిన్ను కృష్ణవతారుడనేదా
బొజ్జ నిండా పాలు పోయావే ఓయమ్మ నన్ను బుద్దావతారడనవే
బొజ్జ నిండా పాలు పోసెదా ఓరయ్య నిన్ను బుద్దావతారుడనేదా
కలికి కుచ్చుల జడలు వేయవే ఓయమ్మ నన్ను కల్కావతారుడనవే
కలికి కుచ్చుల జడలు వేసేదా ఓరయ్య నిన్ను కల్కావతారుడనేదా
తిరుమల వచ్చి దర్శించవే ఓయమ్మ నన్ను శ్రీ వేంకటేశుడనవే
తిరుమల వచ్చి దర్శించేదా ఓరయ్య నిన్ను శ్రీ వేంకటేశ్వడనేదా