కైలాస వాసుని ప్రియసుతుడు కన్నిమూల గణపతియే
ఇంటింట వెలసినాడయ్య కన్నిమూల గణపతియే
శంకర నందన గణేశ - షణ్ముఖ సోదర గణేశ ||కైలాస॥
కష్టాలను తొలగచేయు కలిభగవానే స్వామి కలిభగవానే
కలియందు కరుణించు దైవము కలి భగవానే స్వామి కలిభగవానే
హే శివ నందన గణేశ - హే గిరిజాసుత గణేశ ||కైలాస॥
గజముఖమును ధరియించిన గణనాయకుడే స్వామి గణనాయకుడే
గౌరి రమణల గారాల బిడ్డ గణనాయకుడే స్వామి గణనాయకుడే
గౌరినందన గణేశ - గాత్రమోహన గణేశ ||కైలాస॥
అందరిని ఆదరించు ఆది దేవుడే స్వామి ఆది దేవుడే
ఆర్తులను రక్షించే ఆది దేవుడే స్వామి ఆది దేవుడే
ఆశ్రిత వత్సల గణేశ - అనాధ రక్షక గణేశ ||కైలాస॥
లోకాలను ఏలేటి లోక నాయకుడే స్వామి లోక నాయకుడే
లోపాలను క్షమియించే లోకనాయకుడే స్వామి లోకనాయకుడే
లంభోధర గణేశ - ఏకదంత గణేశ |||కైలాస॥