దిగిరా దిగిరా నాగన్నా దిక్కులు చూడకు నువ్వన్నా
మ్రొక్కులు తీర్చగ మేమున్నా ఎక్కడ ఉన్నావు నాగన్నా
పుట్టలో ఉన్నా నాగన్నా - నీ చుట్టాల్నందర్ని తెమ్మన్నా
మొహమాట మెందుకు నీకన్నా - మీ బంధువుల్తో రమ్మన్నా
జాలము చేయకు నాగన్నా - మా పిల్లలు ఉపవాసం నున్నా
పుట్టలో పాలు వేయకున్నా -మా పిల్లల పొట్టలు నిండవన్నా
ఇప్పుడే పిండిన గోవు పాలనూ - ఆరగిస్తావని చూస్తున్నా
పిల్లల అల్లరి జూడన్నా - వారాకలి నే గమనించన్నా
నువ్వులు బెల్లంతో చిమ్మీని చేసీ - చలిమిడి చేసి తీసుకొచ్చి
నివేద నిచ్చాము నీకన్నా - చల్లగా వచ్చీ తినమన్నా
నాగుల చవితి పండుగ రోజున - అందరూ ఒక్కసారి ఆహ్వానిస్తే
అందరి దరికీ నాగన్నా - నీవెట్టా వెళతావు నీవన్నా
ముందుగా మా దరికి నాగన్న - రావాలనీ ఎదురు చూస్తున్నా
మనవినీ మన్నించి నీ వన్నా - ప్రసన్నమయ్యావు నాగన్న
వచ్చా వయ్యా నాగన్నా - వందనమయ్యా నాగన్న
అందర్నీ ఆశీర్వదించన్నా - మా పూజలు అందుకో నాగన్నా
మా పిల్లల నాట్యం చూడన్నా - నిన్ను జూసీ సంతోషిస్తున్నా
అందరి పాటలు వినుమన్నా - వివిధ రచనలు గైకొను మన్నా