గణపతి శరణం గజముఖ శరణం శరణం శరణం గణనాధా
దేవా శరణం స్వామీ శరణం శరణం శరణం గణనాధా
విశ్వాసముతో నిన్ను తలచితే విఘ్నములుండవు గణనాధా
చిత్తములోనా నిన్ను నిలిపితే చింతలు ఉండవు గణనాధా
శివపార్వతులకు చిన్న పాపడై వెలిగిన దేవా గణనాధా
ప్రధమగణములకు పెద్ద దేవుడై ప్రభవించేవు గణనాధా
పత్రిపూజకే పరవశించేవు చిత్రము నీ దయ గణనాధా
ఉండ్రాళ్ళు నొసగిన ఉబ్బిపోయేవు ఉత్తమ దేవా గణనాధా
ముల్లోకాలకు ముద్దు దేవుడా మూషికవాహన గణనాధా
మొక్కినవారికి మోదములిచ్చే చక్కని తండ్రీ గణనాధా
చేతులెత్తి నిను శరణము కోరేము సేవించేము గణనాధా
వ్రతము పట్టి నిను ప్రార్ధించేము వరములియ్యవా గణనాధా