నింగిలోన చందమామ రా తల్లి
దుర్గమ్మ రా మన దుర్గమ్మ రా
ఈ ధరణిలో నా అవతరించే రా
అమ్మ మన కోసమే దిగి వచ్చేరా(2)
శరణుశరణు దుర్గమ్మ శరణమo దుకోవమ్మా విజయవాడ దుర్గమ్మ విజయ మోసగా రావమ్మా
(కోరస్)
ఓంకారములో నీవు పుట్టావమ్మా
నీకు తల్లిదండ్రులంటూ ఎవరు లేరోయమ్మ
ఈ సృష్టికేమూలమని తలచామమ్మా
ఈ ముల్లోకాల్లో నీకు సాటీ ఎవరమ్మ
శరణుశరణు దుర్గమ్మ శరణమoదుకోవమ్మా విజయవాడ దుర్గమ్మ విజయ మోసగా రావమ్మా
(కోరస్) (నింగిలోన)
ముగ్గురఅమ్మలకే మూలము ఆది శక్తిమ్మ
ఆ ఆదిశక్తి రూపనివి నీవేనమ్మ
ముగ్గురు త్రిమూర్తులకు తల్లి నీవమ్మా.
ముక్కోటి జీవులకు ప్రాణదాత మాయమ్మ
శరణుశరణు దుర్గమ్మ శరణమo దుకోవమ్మా విజయవాడ దుర్గమ్మ విజయ మోసగా రావమ్మా
(కోరస్)(నింగిలోన)
పది తలలు మూడు కనులు కలిగితివమ్మా.
ఆ మహంకాళి రూపానివి నీవేనమ్మ.
దుర్గాసురుడను అంతము చేసావమ్మా
విజయ కనకదుర్గగా పేరుగాంచావామ్మ
శరణుశరణు దుర్గమ్మ శరణమo దుకోవమ్మా విజయవాడ దుర్గమ్మ విజయ మోసగా రావమ్మా
నింగిలోన చందమామ రా తల్లి
దుర్గమ్మ రా మన దుర్గమ్మ రా
ఈ ధరణిలో నా అవతరించే రా
అమ్మ మన కోసమే దిగి వచ్చేరా
శరణుశరణు దుర్గమ్మ శరణమo దుకోవమ్మా విజయవాడ దుర్గమ్మ విజయ మోసగా రావమ్మా(4)
(కోరస్)