కళ్యాణి రాగం
ఆదితాళం
సాకి...
వాణి వీణ పాణి మంజుల వాగ్విళాసిని
అమ్మా భువనేశ్వరి సరస్వతీ.....
భగవతీ భారతీ పూర్ణేందు పూర్ణేందు బింబాణన
పల్లవి...
అమ్మా శారద భువనేశ్వరి
సంగీత సాహిత్య సుమభాషిణి. !!అమ్మా!
ఆవిధాతకే హృదయేశ్వరివై
కవులా కవితగా వెలసిన తల్లి
నాలుగు వేదములా తల్లివి నీవే
రాగ తాళమై వెలసిన తల్లీ
లయముతప్పగా సలఃపుము తల్లీ. !!అమ్మా!!
నారదాదులే గానం చేయగా
లక్ష్మీ గణపతీ తాళము వేయగా
శివకేశవులే పరవశింపగా
రాగతాళమై వెలసిన తల్లి
లయముతప్పగా సలుపుము తల్లి. !!అమ్మా!!