సాకి...
మముగన్న తల్లి ఎల్లమ్మ
నిను కీర్తింప మేమెంత వారము
పదునాలుగు లోకములనేలే జనయిత్రీ
అమ్మా...ఎల్లమ్మా..
పల్లవి...
శరణం శరణం శరణం
ఎల్లమ్మ తల్లి శరణం
శ్రీకల్పవల్లిశరణం
అమ్మా భవాని శరణం
శరణం శరణం శరణం
కారుచీకటిలోన కాంతిరేఖవు నీవు
కోరి కొలిచేవారి కొంగు పసిడివి నీవు
ఎంతవేడినగాని కొంతైన దయరాదా ...
దారిచూపి మమ్ము దరిచేర్చుకోవమ్మా
శరణం శరణం శరణం
అంతరంగములోన నిన్ను కొలిచేవారి
చింతలను బాపేటి ఎల్లమ్మ తల్లి
లేరు లేరు తల్లి నీకన్న దైవమూ ...
కరునచూపి మమ్ము కాపాడవమ్మ