శ్రీ లక్ష్మి నరసింహా - మము కాపాడుము దేవా.. ఆ...
శ్రీ లక్ష్మి నరసింహా - మము కాపాడుమా దేవా ఆ...
|| శ్రీ ||
సింహాచలేశ్వర నీ సేవచేయగ నీ దరిని చేరామురాచరణాలు వేడి నీ శరణుకోరి నిను భక్తి వేడాము వేవేగరా
|| శ్రీ ||
తులసీ దళాలు సంపెంగ పూలతో నీ పూజ చేసామురాసిరి చందనాల గంధాలు పూసి మనసార నిను కొలువ వరమీయరా
|| శ్రీ ||
ప్రహ్లాద వరదా ఓ భక్త మందార దీనులము కరుణించరా పరమాత్మ పలుక అలుకేలనయ్యా మమ్ములను పాలింప రావేమిరా
|| శ్రీ ||
నీ నామ స్మరణం మధురాతి మధురం పొడగను భాగ్యమురానీ పుణ్య పాదం తాకినను చాలు శుభచరణ మా జన్మ తరియించురా
|| శ్రీ ||
దేవాది దేవా దివ్య ప్రభావా మాతోడు నీడవురాదివిజేంద్ర వంద్యా ధర నుంటినయ్యా అప్పన్న దాసుడను నన్నేలరా
|| శ్రీ ||
